ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం.. 12 నుంచి ఆమరణ దీక్షలు..
టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 37వ రోజుకు చేరింది. తమ డిమాండ్ల సాధన కోసం నిన్న ట్యాంక్ బంద్ వద్ద మిలియన్ మార్చ్ చేపట్టిన వర్కర్లు.. ఇవాళ అన్ని డిపోల వద్ద నల్లటి బ్యాడ్జీలతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మిలియన్ మార్చ్ నేపథ్యంలో నిన్న పోలీసులు లాఠీఛార్జ్ జరిపిన సంగతి తెలిసిందే. అందులో పలువురు కార్మికులు గాయాలపాలయ్యారు. కాగా, సోమవారం ఆర్టీసీ సమ్మెపై అటు ప్రభుత్వం.. ఇటు ఆర్టీసీ జేఏసీ కోర్టులో తమ వాదనలు వినిపించనున్నారు. ఈ […]

టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 37వ రోజుకు చేరింది. తమ డిమాండ్ల సాధన కోసం నిన్న ట్యాంక్ బంద్ వద్ద మిలియన్ మార్చ్ చేపట్టిన వర్కర్లు.. ఇవాళ అన్ని డిపోల వద్ద నల్లటి బ్యాడ్జీలతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మిలియన్ మార్చ్ నేపథ్యంలో నిన్న పోలీసులు లాఠీఛార్జ్ జరిపిన సంగతి తెలిసిందే. అందులో పలువురు కార్మికులు గాయాలపాలయ్యారు. కాగా, సోమవారం ఆర్టీసీ సమ్మెపై అటు ప్రభుత్వం.. ఇటు ఆర్టీసీ జేఏసీ కోర్టులో తమ వాదనలు వినిపించనున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ.. అఖిలపక్ష నేతలు సమావేశం అయ్యి.. భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేశారు. రేపు ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించగా.. 12వ తేదీన ఆర్టీసీ జేఏసీ నేతలు ఆమరణ నిరాహారదీక్షకు దిగనున్నారు. ఆ తర్వాత 13న ఢిల్లీ వెళ్లి జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు.
ఇదిలా ఉండగా ఛలో ట్యాంక్ బంద్ ప్రశాంతంగా జరిగిందని.. పోలీసులు లాఠీఛార్జ్ చేయడం సరికాదని జేఏసీ నేతలు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని వదులుకుని చర్చలకు పిలవాలన్నారు. ఇకపోతే రేపు హైకోర్టు.. ఆర్టీసీ సమ్మెపై కీలక తీర్పు వెల్లడిస్తుందని జేఏసీ ఆశాభావం వ్యక్తం చేశారు.




