మసీదు కోసం 5 ఎకరాలు తీసుకోవాలా ? వద్దా ?

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డు రంగంలోకి దిగింది. మసీదు నిర్మాణానికి అయిదు ఎకరాలు కేటాయించాలన్న కోర్టు రూలింగ్ మేరకు దీనిపై వచ్ఛే 15 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది. ఈ పక్షం రోజుల్లో బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటామని బోర్డు చైర్మన్ జాఫర్ ఫరూఖీ తెలిపారు. అదే సమయంలో ముస్లిములకు సంబంధించిన ఇతర ప్రయోజనాలపై ప్రభుత్వంతో చర్చించాల్సిన అంశాలను కూడా […]

  • Anil kumar poka
  • Publish Date - 3:59 pm, Sun, 10 November 19
మసీదు కోసం 5 ఎకరాలు తీసుకోవాలా ? వద్దా ?

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డు రంగంలోకి దిగింది. మసీదు నిర్మాణానికి అయిదు ఎకరాలు కేటాయించాలన్న కోర్టు రూలింగ్ మేరకు దీనిపై వచ్ఛే 15 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది. ఈ పక్షం రోజుల్లో బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటామని బోర్డు చైర్మన్ జాఫర్ ఫరూఖీ తెలిపారు. అదే సమయంలో ముస్లిములకు సంబంధించిన ఇతర ప్రయోజనాలపై ప్రభుత్వంతో చర్చించాల్సిన అంశాలను కూడా ప్రస్తావిస్తామని ఆయన చెప్పారు. తమ ఇదివరకటి ముసాయిదా ఒప్పందం లోని పలు అంశాలపైనా బోర్డు చర్చిస్తుందని జాఫర్ పేర్కొన్నారు. కాగా-సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమని, కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన స్పష్టం చేసిన సంగతి విదితమే.