తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి సోమవారం విడుదల చేశారు.

తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి సోమవారం విడుదల చేశారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలో 90.28 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 58,392 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. 45,975మంది పరీక్ష రాసినట్టు పాపిరెడ్డి చెప్పారు. వీరిలో 41,506 మంది విద్యార్థులు అర్హత సాధించారని వివరించారు. కరోనాతో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లోనూ బాగా చదివి అర్హత సాధించిన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నష్టపోకూడదని భావించి విపత్కర పరిస్థితుల్లోనూ పరీక్ష నిర్వహించి ఫలితాలు ఇచ్చామని తెలిపారు.
తొలి ఐదు ర్యాంకర్లు వీరేః
1. బి.సుభశ్రీ- ఎస్‌ఆర్ నగర్, హైదరాబాద్ (మార్కులు 159.5)
2. జి. సందీప్- ఆర్మూర్, నిజామాబాద్ (మార్కులు 144.50)
3. అవినాశ్ సిన్హా – ఈసీఐఎల్, హైదరాబాద్ (మార్కులు 142.43)
4. ఎ. ప్రసన్న లక్ష్మీ – వరంగల్ (మార్కులు 142)
5.శ్రీకృష్ణసాయి – ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి (మార్కులు 141.40)




