ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు
ఓటుకు నోటు సంబంధించిన కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు అయ్యింది. ఓటుకు నోటు కేసు నుంచి

MLA sandra venkata veeraiah: ఓటుకు నోటు సంబంధించిన కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు అయ్యింది. ఓటుకు నోటు కేసు నుంచి తనను తొలగించాలన్న అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. సండ్ర డిశ్చార్జ్ పిటిషన్‌తో పాటు ఉదయ్ సింహ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఈ నెల 4కి న్యాయస్థానం వాయిదా వేసింది. కాగా ఓటుకు నోటు కేసులో వీరయ్య చాలా కీలకంగా వ్యవహరించారన్న అభియోగంతో ఏసీబీ కోర్టు గతంలో ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Read More:
14 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యా: ఆమిర్ తనయ



