మొదటి రోజు పాఠశాలలకు 80 శాతం హాజరు…

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Nov 02, 2020 | 4:26 PM

ఆంధ్రప్రదేశ్‌లో బడి గంటలు మోగాయి. ఈ ఉదయాన్నే విద్యార్తులు సంతోషంగా పాఠశాలలకు పరుగులు పెడుతూ కనిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సరేష్‌ తెలిపారు. విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాఠశాలలు, కళాశాలలకు వచ్చరని తెలిపారు.

మొదటి రోజు పాఠశాలలకు 80 శాతం హాజరు...

AP Schools Re-Open ఆంధ్రప్రదేశ్‌లో బడి గంటలు మోగాయి. ఈ ఉదయాన్నే విద్యార్తులు సంతోషంగా పాఠశాలలకు పరుగులు పెడుతూ కనిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సరేష్‌ తెలిపారు. విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాఠశాలలు, కళాశాలలకు వచ్చరని తెలిపారు.

మొదటి రోజు దాదాపు 80 శాతం విద్యార్థులు హాజరయ్యారు అని అన్నారు. ఇప్పటికే చాలా పాఠశాలలు ‘నాడు-నేడు’ కార్యక్రమం కింద అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే విద్యార్థులకు జగనన్న విద్య కానుక ఇచ్చామని, అన్ని వసతులు వారికి అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. తల్లిదండ్రులు, విద్యార్థుల్లో కోవిడ్ పట్ల అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

కోవిడ్ నేపథ్యంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు 70 శాతం ఫీజు మాత్రమే వసూలు చేయాలని అదేశించారు. ఇది న్యాయమైన నిర్ణయం. దాదాపు అయిదారు నెలలు స్కూల్స్ నడవలేదు. అలాంటప్పుడు పూర్తి ఫీజు ఎలా వసూలు చేస్తారు అంటూ మంత్రి ప్రశ్నించారు.

వాళ్ళకి టీచర్లు, సిబ్బంది జీతాలు ఉంటాయి కాబట్టి అన్ని ఆలోచించి 70 శాతం ఫీజు నిర్ణయించామని తెలిపారు. ఏ ఒక్కరూ అంతకు మించి వసూలు చేయవద్దని అన్నారు. అలా చేస్తున్నట్లు పిర్యాదు వస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో నిబంధనల మేరకు వసతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆయా సంస్థల్లో వసతులపై ఆకస్మిక తనికీలు చేస్తున్నామని అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu