ఫ్లోరిడాలోని గోల్ఫ్ కోర్స్ గ్రౌండ్ లో ఈ జీవికేం పని ?

ఫ్లోరిడా చుట్టుపక్కల గల సరస్సులు, దగ్గరలోని నదుల నుంచి తరచూ గోల్ఫ్ కోర్స్ మైదానాల్లోకి మొసళ్ళు చొరబడుతున్నాయి. తాజాగా దాదాపు  ఏడెనిమిది అడుగుల పొడవున్న భారీ మొసలి ఈ గ్రౌండ్ లో నింపాదిగా సాగుతున్న దృశ్యాన్ని చూసిన ఈ కోర్స్ ఉద్యోగి ఒకరు వెంటనే వీడియో తీశారు. కూల్ గా నడుచుకుంటూ వస్తున్న ఈ జీవిని చూసి ఆటగాళ్లంతా తలో దిక్కూ పారిపోయారు. ‘ఎనదర్ డే ఇన్ ఫ్లోరిడా.. వైల్డ్ లైఫ్ ఆన్ ది గోల్ఫ్ కోర్స్’ […]

  • Umakanth Rao
  • Publish Date - 4:38 pm, Mon, 2 November 20
ఫ్లోరిడాలోని గోల్ఫ్ కోర్స్ గ్రౌండ్ లో ఈ జీవికేం పని ?

ఫ్లోరిడా చుట్టుపక్కల గల సరస్సులు, దగ్గరలోని నదుల నుంచి తరచూ గోల్ఫ్ కోర్స్ మైదానాల్లోకి మొసళ్ళు చొరబడుతున్నాయి. తాజాగా దాదాపు  ఏడెనిమిది అడుగుల పొడవున్న భారీ మొసలి ఈ గ్రౌండ్ లో నింపాదిగా సాగుతున్న దృశ్యాన్ని చూసిన ఈ కోర్స్ ఉద్యోగి ఒకరు వెంటనే వీడియో తీశారు. కూల్ గా నడుచుకుంటూ వస్తున్న ఈ జీవిని చూసి ఆటగాళ్లంతా తలో దిక్కూ పారిపోయారు. ‘ఎనదర్ డే ఇన్ ఫ్లోరిడా.. వైల్డ్ లైఫ్ ఆన్ ది గోల్ఫ్ కోర్స్’ అంటూ ఆ ఉద్యోగి ఫేస్ బుక్ లో ఈ ‘స్పోర్టివ్ క్రోకడైల్’ గురించి ప్రస్తావించి వీడియోను వదిలింది. అయితే ఈ గోల్ఫ్ కోర్స్ మైదానంలో గతంలోనూ మొసళ్ళు దర్శనమిచ్చాయి.