మనసున్న డాక్టర్‌ అల్తాఫ్‌ షేక్‌కు కోటిదండాలు

వైద్యో నారాయణో హరిః అన్నారు.. అంటే వైద్యుడు భగవంతుడితో సమానమన్నమాట! అంతటి చల్లటి మనసు ఉండేవాళ్లు చాలా అరుదు.. అలాంటి అరుదైన డాక్టర్లలో అల్తాఫ్‌ షేక్‌ ఒకరు.. ఆయన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ప్రముఖ యూరాలజిస్ట్‌.. ఓ రోజు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న శాంతాబాయ్‌ సూరద్‌ అనే ఓ వృద్ధురాలు ఆయన దగ్గరకు వచ్చింది.. తన దీనగాధ వినిపించింది.. తన ఇద్దరు కుమారులను పొగట్టుకుని ఆమెకు నా అన్నవారు లేరు.. ఒక కుమారుడు గుండెపోటుతో చనిపోతే, మరొక కుమారుడు […]

మనసున్న డాక్టర్‌ అల్తాఫ్‌ షేక్‌కు కోటిదండాలు
Follow us

|

Updated on: Nov 02, 2020 | 4:20 PM

వైద్యో నారాయణో హరిః అన్నారు.. అంటే వైద్యుడు భగవంతుడితో సమానమన్నమాట! అంతటి చల్లటి మనసు ఉండేవాళ్లు చాలా అరుదు.. అలాంటి అరుదైన డాక్టర్లలో అల్తాఫ్‌ షేక్‌ ఒకరు.. ఆయన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ప్రముఖ యూరాలజిస్ట్‌.. ఓ రోజు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న శాంతాబాయ్‌ సూరద్‌ అనే ఓ వృద్ధురాలు ఆయన దగ్గరకు వచ్చింది.. తన దీనగాధ వినిపించింది.. తన ఇద్దరు కుమారులను పొగట్టుకుని ఆమెకు నా అన్నవారు లేరు.. ఒక కుమారుడు గుండెపోటుతో చనిపోతే, మరొక కుమారుడు ఏడేళ్ల కిందట దేశం కోసం ప్రాణాలర్పించాడు.. నిరుపేదరాలైన ఆమె కథ డాక్టర్‌ను కదిలించింది.. కంటతడి పెట్టింది.. వెంటనే హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడారు.. ఆమెకు ఉచితంగా సర్జరీ చేశారు. సర్జరీ విజయవంతమయ్యింది.. ఆమెను డిశ్చార్జ్‌ చేసే సమయంలో డాక్టర్‌ అల్తాఫ్‌ షేక్‌ భావోద్వేగానికి గురయ్యారు.. శాంతాబాయ్‌ సూరద్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.. ఆమె కన్నీళ్లు తుడిచాడు.. తను కూడా కన్నీళ్లు పెట్టారు.. ఈ దృశ్యాన్ని చూసినవారి కళ్లన్ని చెమ్మగిల్లాయి.. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది.. ఈ వీడియో చూసిన కాంగ్రెస్‌ నాయకుడు, మహారాష్ట్ర ప్రజా వ్యవహారాల శాఖ మంత్రి అశోక్‌ చావన్‌ను అల్తాఫ్‌ షేక్‌ను పర్సనల్‌గా పిలిపించుకుని అభినందించారు. ఆయనే కాదు చాలా మంది అల్తాఫ్‌ను మెచ్చుకుంటున్నారు.. వీడియోను చూసినవారు సంజయ్‌దత్‌ మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు.. అందులో కూడా సంజయ్‌దత్‌ అందరికీ ఆప్యాయంగా జాదూకీ జప్పీ ఇస్తుంటారు..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!