ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్ నిలిపివేయండి..వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాఫ్ట్ వేర్ లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, PTIN నిలిపివేయాలని అధికారులకు సూచించింది. ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని...
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాఫ్ట్ వేర్ లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, PTIN నిలిపివేయాలని అధికారులకు సూచించింది. ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాఫ్ట్‌వేర్‌లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని సూచించింది. కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ ప్రకియలో ఇతర గుర్తింపు పత్రాలు అడగొచ్చని.. ఆధార్ వివరాలు మాత్రం సేకరించవద్దని స్పష్టం చేసింది.
ఎలాంటి చట్టం లేకుండా ధరణిలో ఆస్తుల నమోదుతోపాటు కులం, ఆధార్ వివరాలు అడగటాన్ని సవాలు చేస్తూ న్యాయవాదులు కె.సాకేత్, ఐ.గోపాల్‌శర్మ మరికొందరు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టులో వారి వాదనలు ముగిశాయి.
న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ప్రభుత్వం ఉల్లంఘించిందని.. తెలివిగా ప్రజల సున్నితమైన సమాచారం సేకరిస్తే అంగీకరించబోమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపైనే తమ ఆందోళన అని.. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి సమర్పించాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.