Goat Detention: తప్పు చేసిందని మూగ జీవిని తాళ్లతో కట్టేసిన మున్సిపల్ సిబ్బంది.. అంత పెద్ద తప్పు ఏంచేసిందబ్బా..?

అక్కడ ఎవరైనా తప్పు చేస్తే కట్టేస్తారు.. విచారించి జరిమానా విధిస్తారు. ఇక్కడ అధికారులు మాత్రం మనుషులకు మాదిరిగానే జంతువులకు శిక్ష విధించారు.

Goat Detention: తప్పు చేసిందని మూగ జీవిని తాళ్లతో కట్టేసిన మున్సిపల్ సిబ్బంది.. అంత పెద్ద తప్పు ఏంచేసిందబ్బా..?
Goat Detention
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Balaraju Goud

Updated on: Jul 10, 2021 | 10:18 AM

Goat Detention in Municipal office: ఎందుకంటే ఏదైనా నేరమో..హత్యనో..చోరీనో చేస్తే నిందితులను అరెస్ట్‌ చేయడం చూశాం.. కానీ నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో మాత్రం.. ఓ మేకను మున్సిపల్ కార్యాలయంలో బంధించారు సిబ్బంది. ఇంతకీ ఆ మేక చేసిన నేరమేంటంటే హరితహారం కోసం తీసుకొచ్చిన మొక్కలను తినేసిందట. అదీ సంగతి. హరితహారం మొక్కలు తిన్నందుకు ఆ మేకను బందీని చేశారు అధికారులు. అంతేకాదు. మున్సిపాలిటీలో హరితహారం మొక్కలు తింటున్న మరో 20 ఆవులను పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా, రైతులు వేడుకోవడంతో వదిలి వేశారు.

అక్కడ ఎవరైనా తప్పు చేస్తే కట్టేస్తారు.. విచారించి జరిమానా విధిస్తారు. ఇక్కడ అధికారులు మాత్రం మనుషులకు మాదిరిగానే జంతువులకు శిక్ష విధించారు. ఓ మేక తప్పు చేసిందని బందీ చేశారు. నాగార్జున సాగర్ లోహరితహారం మొక్కలు తిన్న మేకను బందీ చేశారు మున్సిపల్ సిబ్బంది. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలను ఓ మేక మేసింది. ఈ మేకతో పాటు సాగర్ చుట్టుపక్కల తండాల నుంచి వచ్చి వీధుల వెంట తిరుగుతున్న 20 ఆవులను కూడా మున్సిపల్ సిబ్బంది పోలీస్ స్టేషన్ కు తరలించారు.

విషయం తెలుసుకున్న రైతులు తమ ఆవులను ఇంటికి తోలుకు వెళ్దామని మున్సిపల్ అధికారులు వేడుకోవడంతో వదిలివేశారు. మేక యజమాని రాకపోవడంతో సిబ్బంది మున్సిపల్ కార్యాలయంలో కట్టేశారు. విషయం తెలుసుకున్న మేక యజమాని సాయంత్రం వచ్చి మున్సిపల్ అధికారులు వేడుకోవడంతో బందీ నుంచి విముక్తి పొందింది మేక. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే మేకల పశువుల యజమానులకు జరిమానా విధిస్తామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.

తెలంగాణ వ్యాప్తంగా హరిహారం కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. అయితే మొక్కలను నాటడమే కాదు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా నాయకులపై ఉంటుంది. అయితే, ఇక్కడ హరితహారం మొక్కలు తిన్నదనే కోపంతో ఓ మూగజీవిని మున్సిపల్ కార్యాలయంలో తాళ్లతో బంధించారు. మొక్కలకు రక్షణ చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ సిబ్బందికి అంతే బాధ్యత ఉంటుంది. మూగజీవాలను బంధించడం కరెక్ట్ కాదని జంతు ప్రేమికులు అంటున్నారు.

Read Also…  AP Tenth Results: ఏపీలో పదో తరగతి విద్యార్థుల మార్కుల కేటాయింపుపై కసరత్తు.. ఫార్మెటివ్ మార్కుల ఆధారంగా ..