AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: టీచర్లకు బ్యాడ్‌ న్యూస్.. ప‌దోన్నతులు విషయంలో సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ విద్యాకమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల‌కు ఆటోమేటిక్ ప‌దోన్నతులు ఉండ‌కూడ‌ద‌ని ప్రభుత్వానికి సూచన చేసింది. వారి ప‌ని తీరు ఆధారంగానే ప్రమోష‌న్లు ఉండాల‌ని సూచించింది. తెలంగాణ విద్యా క‌మిష‌న్ త‌న నివేదిక‌ను సీఎం రేవంత్ రెడ్డికి గురువారం స‌మ‌ర్పించింది.విద్యా విధానం పూర్తిగా విద్యార్థి కేంద్రంగా ఉండాల‌ని క‌మిష‌న్ సిఫార్సు చేసింది.

Telangana: టీచర్లకు బ్యాడ్‌ న్యూస్.. ప‌దోన్నతులు విషయంలో సర్కార్ సంచలన నిర్ణయం!
Telangana Education Reforms
Prabhakar M
| Edited By: |

Updated on: Feb 26, 2026 | 10:26 PM

Share

ఉపాధ్యాయుల ప‌ని తీరును ప్రతి అయిదేళ్లకోసారి అంచ‌నా వేయాలని, దాని ఆధారంగా ఆ ఉపాధ్యాయునికి ఒక నివేదిక అంద‌జేయాలని విద్యా కమిషన్ పేర్కొంది. ప‌ని తీరు మెరుగుప‌ర్చుకోవ‌డానికి అత‌నికి రెండేళ్లు స‌మ‌యం ఇవ్వాలని.. అప్పటికీ ప‌ని తీరు మెరుగుప‌డ‌క‌పోతే అత‌నిని స‌ర్వీసు నుంచి తొల‌గించాలి నివేదికలో పేర్కొంది. ప‌ని తీరు మెరుగ్గా ఉంటే ప్రమోష‌న్లు ఇవ్వాలి.. అయితే ఇప్పటికే స‌ర్వీసులో ఉన్న వారికి వీటిని వ‌ర్తింప‌చేయ‌కూడదని తెలిపింది. ఇక నుంచి నియ‌మించే ఉపాధ్యాయుల‌కు వ‌ర్తింప‌జేయాలని నివేదికలో పేర్కొంది.

డిప్లమో ఇన్ ఎలిమెంట‌రీ ఎడ్యకేష‌న్ (D.EI.ED)ను ర‌ద్దు చేయాలని, బీఎడ్‌ను పున‌ర్వ్యవ‌స్థీక‌రించి న‌ర్సరీ నుంచి అయిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు బీఎడ్ (ప్రైమ‌రీ), 6వ త‌ర‌గ‌తి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు బీఎడ్ (సెకండ‌రీ) ఉంచాలి. ఇందుకు ఎన్‌సీటీఈతో సంప్రదించాలని నివేదికలో రాసుకొచ్చింది. బీఎడ్ విద్యార్థుల‌కు పాఠ‌శాల‌ల్లో 150 రోజుల బోధ‌నాభ్యసం త‌ప్పని స‌రి చేయాలి పేర్కొంది. బోధ‌నా మాధ్యమంగా ఇంగ్లీష్ ఉండాలి.. న‌ర్సరీ నుంచి యూనివ‌ర్సిటీల వ‌ర‌కు బోధ‌న మాధ్యమం ఇంగ్లీష్ ఉండాలని.. త్రిభాష విధానం ఒక‌టో త‌ర‌గ‌తి నుంచే అమ‌లు చేయాలని పేర్కొంది.

పూర్వ ప్రాథ‌మిక విద్యను (న‌ర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ) ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల్లో అంద‌జేయాలని. విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌ నుంచి వ‌చ్చిన బ‌ల‌మైన డిమాండ్ ఇది. పాఠ‌శాల్లలో విద్యా ప్రమాణాలు, సిబ్బంది నియామ‌కం, వ‌స‌తుల క‌ల్పన‌, నాణ్యతా ప్రమాణాల ప‌ర్యవేక్షణ‌కు స్కూల్ డిస్ట్రిక్‌ల‌ను ఏర్పాటు చేయాలని.. పాఠ‌శాల‌ల్లో వంట వండే మ‌హిళ‌ల‌కు వారానికి ఒక‌సారి చెల్లింపులు చేయాలి.. మ‌ధ్యాహ్న భోజ‌న అంచ‌నాలు, ప్రతిపాద‌న‌లు, చెల్లింపుల కోసం స‌మ‌గ్ర సాఫ్ట్‌వేర్ వాడాలని పేర్కొంది.

IIT-JEE/ NEET కోచింగ్ సెంట‌ర్లు, హాస్టళ్లను నియంత్రించేందుకు చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయాలి.. ఫీజులు, మౌలిక స‌దుపాయాలు, అధ్యాప‌కులు, పాఠ్య ప్రణాళిక‌, విద్యార్థుల మాన‌సిక ఆరోగ్యం, త‌ప్పుదారి ప‌ట్టించే ప్రక‌ట‌న‌ల‌పై నియంత్రణ అవ‌స‌రమని.. ప్రైవేటు జూనియ‌ర్ క‌ళాశాల‌ల నుంచి వేరుగా పోటీ ప‌రీక్షల కోచింగ్‌ను వేరు చేయాలని పేక్కొంది. 12వ త‌ర‌గ‌తిలో మాత్రమే బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలి.. EAPCET ర‌ద్దు చేసి ఇంజినీరింగ్‌, వ్యవ‌సాయం, ఫార్మసీ ప్రవేశాలు 12వ త‌ర‌గ‌తి మార్కుల ఆధారంగా కేటాయించాలి. ఎస్సెస్సీ, ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డుల‌ను విలీనం చేయాలిని సూచించింది. విద్యా ప్రమాణాలు మెరుగుప‌ర్చడానికి క‌నిష్ట ఉత్తీర్ణత శాతాన్ని 45 శాతానికి పెంచాలని తెలిపింది.

విశ్వ విద్యాల‌యాల కార్యనిర్వాహ‌క మండ‌లిని పునర్నిర్మించాలి.. దానికి వైస్ ఛాన్సల‌ర్ ఛైర్మన్‌గా ఉండాలని పేర్కొంది. యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్సల‌ర్ల నియామ‌కం రిటైర్డ్ ఛీప్ సెక్రట‌రీ, యూజీసీ నామిని, ముగ్గురు రిటైర్డ్ వైస్ చాన్సల‌ర్లతో కూడిన సెర్చ్ క‌మిటీ ద్వారా పార‌ద‌ర్శకంగా జ‌ర‌గాలని సూచించింది. యూనివ‌ర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ర‌ద్దు చేయాలని.. విద్యార్థుల నుంచి డిమాండ్ ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల‌ను రెగ్యుల‌ర్ కోర్సులుగా మార్చాలని పేర్కొంది. లింగ్డో క‌మిటీ సిఫార్సుల మేర‌కు విద్యార్థుల ఎన్నిక‌లు నిర్వహించాలని స్పష్టం చేసింది.

మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వ విద్యాల‌యం త‌ర‌హాలో సుర‌వ‌రం ప్రతాప‌రెడ్డి తెలుగు విశ్వ విద్యాల‌యాన్ని బ‌హుళ‌-విభాగ విశ్వ విద్యాల‌యంగా అభివృద్ధి చేయాలని ప్రతి డిగ్రీ కాలేజీకి అనుబంధంగా 200 మంది అతి పేద విద్యార్థుల‌కు హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మేకప్ లేకుండా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ఫొటోస్ ఇదిగో
మేకప్ లేకుండా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ఫొటోస్ ఇదిగో
భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..
భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..
ట్యాన్‌ తొలగించే సింపుల్ ఇంటి చిట్కాలు.. ఇలా ట్రై చేశారంటే...
ట్యాన్‌ తొలగించే సింపుల్ ఇంటి చిట్కాలు.. ఇలా ట్రై చేశారంటే...
ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు.. ఆరోగ్యానికి ఏది నిజమైన అమృతం..?
ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు.. ఆరోగ్యానికి ఏది నిజమైన అమృతం..?
మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?
మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?
గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం..
గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం..
ఒకవైపు కల్తీ మద్యం కాటు… మరోవైపు కాస్ట్లీ బ్రాండ్ల అక్రమ రవాణా!
ఒకవైపు కల్తీ మద్యం కాటు… మరోవైపు కాస్ట్లీ బ్రాండ్ల అక్రమ రవాణా!
ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని..
ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని..
సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.?
సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.?
సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్
సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్