TG CET’s 2026 Schedule: తెలంగాణ EAPCET 2026 పరీక్ష తేదీ వచ్చేసింది..? త్వరలోనే షెడ్యూల్ విడుదల
Telangana EAPCET 2026 likely on April last week: రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్, ఐసెట్, ఈసెట్ వంటి తదితర ప్రవేశ పరీక్షల షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) 2, 3 రోజుల్లో సెట్స్ షెడ్యూల్‌ను..

హైదరాబాద్, డిసెంబర్ 26: తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్, ఐసెట్, ఈసెట్ వంటి తదితర ప్రవేశ పరీక్షల షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) 2, 3 రోజుల్లో సెట్స్ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. ఇప్పటికే 8 ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించిన ఉన్నత విద్యామండలి ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. ప్రభుత్వ ఆమోదం తెలిపిన వెంటనే పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే సెట్స్ షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఉన్నత విద్యామండలి తీరును లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా సెట్స్ పరీక్షల తేదీలను విడుదల చేయకపోవడంతో ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు. డిసెంబరు 27న ప్రభుత్వం ఆమోదం తెలిపితే అదే రోజు ఉన్నత విద్యామండలి పరీక్షల తేదీలను వెల్లడించే అవకాశం ఉంది. మొత్తంగా డిసెంబర్ 29, 30 తేదీల్లో సెట్స్ షెడ్యూల్‌ను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఏపీ ఈఏపీసెట్ పరీక్ష మే 12 నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఈఏపీసెట్ ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభమై, మే మొదటి వారంలో ముగించే అవకాశం ఉన్నట్లు అధికారిక సమాచారం. గతేడాది ఏప్రిల్ 29 నుంచి ఈఏపీసెట్ అగ్రికల్చర్-ఫార్మా పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




