తెలంగాణ కరోనా అప్‌డేట్స్: గడిచిన 24 గంటల్లో 635 పాజిటివ్ కేసులు.. నలుగురు మృతి
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన24 గంటల్లో కొత్తగా 635 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,82,982 పాజిటివ్..
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన24 గంటల్లో కొత్తగా 635 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,82,982 పాజిటివ్ కేసులు నమోదు కాగా,మొత్తం 1,522 మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి 573 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 2,74,833 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది.
రికవరీ రేటు రాష్ట్రంలో 97.12 శాతం ఉండగా, దేశంలో 95.7 శాతం ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం యాక్టివ్ కేసులు 6,627 ఉండగా, హోం ఐసోలేషన్ లో 4,467 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా జీహెచ్ ఎంసీలో 115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.