తెలంగాణలో కరోనా నేటి బులిటెన్ : కొత్తగా 2,734 కేసులు
తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. తాజాగా సోమవారం మరో 2,734 కరోనా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. తాజాగా సోమవారం మరో 2,734 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ బాధితుల సంఖ్య 1,27,697కు చేరింది. కొత్తగా 9 మందిని కొవిడ్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 836కు చేరింది. వ్యాధి బారి నుంచి మరో 2,325 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకుని 95,162 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31,699 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 347 మందికి కరోనా సోకగా.. రంగారెడ్డి 212, నల్గొండలో 191 కొత్త కేసులు వెలుగుచూశాయి.

Also Read :
ఆరు వారాల్లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ !




