చైనా ‘బూచి’, లడాఖ్ వద్ద భారత దళాలను పెంచుతాం, అజిత్ దోవల్

లడాఖ్ వద్ద చైనా ఆక్రమణ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మన దళాల సంఖ్యను పెంచుతామని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తెలిపారు.

  • Umakanth Rao
  • Publish Date - 10:13 am, Tue, 1 September 20
చైనా 'బూచి', లడాఖ్ వద్ద భారత దళాలను పెంచుతాం, అజిత్ దోవల్

లడాఖ్ వద్ద చైనా ఆక్రమణ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మన దళాల సంఖ్యను పెంచుతామని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తెలిపారు. సోమవారం తన అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన, తాజాగా జరిగిన చైనా సైనికుల చొరబాటును ఇండియా తిప్పికొట్టిందని, కానీ రానున్న రోజుల్లో మనం మరింత పకడ్బందీ వ్యూహం ఎలా అనుసరించాలన్నదానిపై ఈ సమావేశంలో చర్చించామని చెప్పారు. చైనా సైతం నియంత్రణ రేఖ వద్ద ఎక్కడో ఒకచోట ఇలా తన దళాలను పెంచే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏమైనా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మనం రెడీగా ఉండాలని అజిత్ దోవల్ అన్నారు ఈ సమావేశంలో ఆర్మీ సీనియర్ అధికారులు, ‘రా’ కార్యదర్శి సమంత గోయెల్, ఐబీ డైరెక్టర్ అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.