కాంగ్రెస్ కు అవమానభారంగా దుబ్బాక ఉపఎన్నిక ఫలితాల సరళి

దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌ సరళి తెలంగాణ కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటివరకూ 12 రౌండ్ల కౌంటింగ్ పూర్తయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అడ్రస్ కనిపించలేదు. ఒక్క 12వ రౌండ్‌లో మాత్రం 83 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఒకానొక సందర్భంలో బీజేపీకి వచ్చిన ఆధిక్యపు ఓట్లు కూడా ఆ పార్టీ దక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో టీకాంగ్రెస్ నేతలకు ఏంమాట్లాడాలోకూడా పాలుపోకుండా ఉంది. ఇదిలాఉంటే, అటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ తెలంగాణ కాంగ్రెస్ […]

కాంగ్రెస్ కు అవమానభారంగా దుబ్బాక ఉపఎన్నిక ఫలితాల సరళి
Follow us
Venkata Narayana

|

Updated on: Nov 10, 2020 | 2:53 PM

దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌ సరళి తెలంగాణ కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటివరకూ 12 రౌండ్ల కౌంటింగ్ పూర్తయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అడ్రస్ కనిపించలేదు. ఒక్క 12వ రౌండ్‌లో మాత్రం 83 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఒకానొక సందర్భంలో బీజేపీకి వచ్చిన ఆధిక్యపు ఓట్లు కూడా ఆ పార్టీ దక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో టీకాంగ్రెస్ నేతలకు ఏంమాట్లాడాలోకూడా పాలుపోకుండా ఉంది. ఇదిలాఉంటే, అటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ తెలంగాణ కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురైంది. ప్రత్యర్థి పార్టీల కంటే అత్యంత తక్కువగా కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డికి కేవలం 142 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు  720 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్ కు 368 ఓట్లు వచ్చాయి.