కావాలనే కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధి విషయాన్ని దాచిపెట్టారు ః ట్రంప్‌

అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌పై డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ఆరోపణలు చేశారు.. ఫైజర్‌, బయో ఎన్‌టెక్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తోన్న కోవిడ్‌ నిరోధక టీకా చక్కగా పనిచేస్తున్నా ఆ విషయాన్ని ఫైజర్‌,

కావాలనే కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధి విషయాన్ని దాచిపెట్టారు ః ట్రంప్‌
Follow us

|

Updated on: Nov 10, 2020 | 2:08 PM

అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌పై డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ఆరోపణలు చేశారు.. ఫైజర్‌, బయో ఎన్‌టెక్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తోన్న కోవిడ్‌ నిరోధక టీకా చక్కగా పనిచేస్తున్నా ఆ విషయాన్ని ఫైజర్‌, ఎఫ్‌డీఏలు కావాలనే దాచిపెట్టారని ఆరోపిస్తున్నారు ట్రంప్‌.. తన విజయాన్ని అడ్డుకునేందుకు ఇంతకు తెగించారంటున్నారు ట్రంప్‌.. ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలు ఫలితాలు వచ్చిన అయిదు రోజుల తర్వాత వ్యాక్సిన్‌ గురించి చెబుతున్నారన్నారు. ఇందులో కుట్ర కోణం దాగి ఉందని చెబుతున్నారు. తనకు బదులుగా అధ్యక్ష స్థానంలో జో బైడెన్‌ ఉండి ఉంటే వ్యాక్సిన్‌ వచ్చి ఉండేది కాదన్నారు.. లక్షల మంది ప్రాణాలు కోల్పోయేవారని చెప్పారు ట్రంప్‌. ఫైజర్‌ సంస్థ ఎన్నికల తర్వాత మాత్రమే వ్యాక్సిన్‌పై ఓ అప్‌డేట్‌ ఇస్తుందని తాను గతంలో చెప్పిన మాట నిజమయ్యిందన్నారు.. ఇదిలా ఉంటే వ్యాక్సిన్‌ తయారీలో డెవలప్‌మెంట్‌ ఉన్నందుకు బైడెన్‌ శుభాకాంక్షలు చెప్పారు. వ్యాక్సిన్‌ తయారీలో పాలుపంచుకున్నవారికి అభినందనలు తెలిపారు. త్వరలోనే వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులోకి వస్తుందని బైడెన్‌ అన్నారు.