Dadasaheb Phalke: రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై రావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నారంటే..
Dadasaheb Phalke: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. రజనీకి అవార్డు రావడం
Dadasaheb Phalke: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. రజనీకి అవార్డు రావడం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నటుడుగా దశాబ్దాల పాటు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారని, నేటికి దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రకటించడం గొప్ప విషయమని అన్నారు. రజనీకి ఈ అవార్డు ప్రకటించడం హర్షించదగ్గ విషయమని కేసీఆర్ అన్నారు.
కాగా, సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌ను రజనీకాంత్‌కు కేంద్ర ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జవడేకర్ గురువారం ప్రకటించారు. 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ సూపర్ స్టార్ అందుకోనున్నట్లు ఆయన తెలిపారు. అయితే 1969 నుంచి ఈ అవార్డులను ప్రకటిస్తుండగా, ఇప్పటి వరకు 50 మంది ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఇందులో 50వ వ్యక్తి అమిత్ బచ్చన్ ఉన్నారు.
హిందీ చిత్ర సీమ నుంచి 32 మంది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందకున్నారు. మిగతా 18 మంది ఇతర భాషల నుంచి ఎంపికయ్యారు. 2018కి గానూ బిగ్‌బీ 66వ జాతీయ చలన చిత్రాల పురస్కారాల్లో భాగంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. కాగా, తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్ 6న జరగనుండగా, ఎన్నికల ముందు కేంద్రం ఈ అవార్డును ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే రజనీకాంత్ 2000లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: Dadasaheb Phalke: సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం.. దాదాసాహెబ్ ఫాల్కే.. అవార్డు పుట్టుపూర్వోత్తరాలివే!