AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా..

తెలంగాణ ప్రభుత్వం జూన్ 2న చేయూత పెన్షన్ పథకం 2026 ద్వారా రెండు లక్షల కొత్త పెన్షన్లను పంపిణీ చేయనుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులతో పాటు కొన్ని వ్యాధుల బాధితులకు ఈ పెన్షన్లు అందనున్నాయి. అర్హత గల పేద కుటుంబాలకు రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు కూడా లభిస్తాయి.

Telangana: జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా..
New Pensions Telangana
Ram Naramaneni
|

Updated on: May 23, 2026 | 8:05 AM

Share

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2న, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా చేయూత పెన్షన్ పథకం 2026 కింద రెండు లక్షల కొత్త పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే 42 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. గత మూడేళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు చేయబడలేదు, కేవలం మరణించిన వారి స్థానంలో వారి భార్యలకు మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. మార్చిలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో ఈ రెండు లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేశారు. ఈ చేయూత పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు నెలవారీ పెన్షన్లు అందుతాయి. ఈ పథకంతో పాటు, అర్హత గల పేద కుటుంబాలకు రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కేటగిరీని బట్టి నిర్దిష్ట అర్హతలు ఉంటాయి.

వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు చేసేవారి కనీస వయసు 57 ఏళ్లు పైబడి ఉండాలి. వితంతు పెన్షన్ పొందాలంటే భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరి. ఒంటరి మహిళలు 18 ఏళ్లు నిండి, కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు లేనివారై ఉండాలి. వికలాంగులు కనీసం 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు ప్రభుత్వ వైద్య అధికారుల సర్టిఫికెట్ సమర్పించాలి. దరఖాస్తు కోసం అర్హులైన వారు కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ, నివాస ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబర్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, డిసేబిలిటీ సర్టిఫికెట్ (వికలాంగుల విషయంలో), డెత్ సర్టిఫికెట్ (వితంతువుల విషయంలో), వైద్య ధ్రువపత్రాలు (వ్యాధిగ్రస్తుల విషయంలో) ఉన్నాయి. చేయూత పెన్షన్‌ను ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా సంబంధిత కార్యాలయం నుంచి చేయూత అప్లికేషన్ ఫారంను తీసుకోవాలి. అందులోని వివరాలన్నింటినీ ఎటువంటి తప్పులు లేకుండా నింపి, అవసరమైన పత్రాలను జతచేయాలి. దరఖాస్తు చేసుకున్న వివరాలను అధికారులు తనిఖీ చేసి, పెన్షన్‌ను ఆమోదిస్తారు. ఆ తర్వాత ప్రతి నెలా పెన్షన్ మొత్తం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. మరిన్ని వివరాల కోసం cheyutha.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us