AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 15 ఏళ్లకే ఇండస్ట్రీని ఏలేసింది.. 6 ఏళ్లలో 25 సినిమాలతో సంచలనం.. 21 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు..

సినీరంగంలో నటిగా గుర్తింపు రావడం అంత సులభమేమి కాదు. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుని స్టార్ డమ్ తెచ్చుకున్న నటీనటులు చాలా మంది ఉన్నారు. కానీ కేవలం 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ గెలుచుకుని ఆత్మ విశ్వాసంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి .. కేవలం ఆరేళ్లలో చక్రం తిప్పింది. 21 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయింది.

Tollywood : 15 ఏళ్లకే ఇండస్ట్రీని ఏలేసింది.. 6 ఏళ్లలో 25 సినిమాలతో సంచలనం.. 21 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు..
Monisha Unni
Rajitha Chanti
|

Updated on: May 23, 2026 | 7:32 AM

Share

సాధారణంగా సినీరంగంలో అందం, ప్రతిభ రెండూ ఉన్న హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు. తొలి సినిమాతోనే జాతీయ అవార్డ్ అందుకుని ఇండస్ట్రీని శాసించిన ఓ హీరోయిన్ గురించి మీకు తెలుసా. స్టా్ర్ హీరోయిన్ అవ్వాల్సిన ఆమె జీవితం ఒక్క రాత్రిలో మారిపోయింది. అందంగా తెరపై సందడి చేసిన ఆమె.. అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె మరెవరో కాదు.. కేరళకు చెందిన మోనిషా ఉన్ని. ప్రసిద్ధ మోహినియాట్ట నర్తకి శ్రీదేవి ఉన్ని, నారాయణ్ ఉన్ని దంపతుల ఏకైక కుమార్తె. 5 ఏళ్ల వయసు నుంచి తల్లి దగ్గర శాస్త్రీయ నాట్యం నేర్చుకుంది. 14 ఏళ్ల వయసులో, ఆమె ‘భవాయ’ అనే సినిమాలో నటించింది. 198లో విడుదలైన ఈ చిత్రానికి దర్శకుడు ఎండి వాసుదేవన్ నాయర్ దర్శకత్వం వహించారు. 15 ఏళ్ల వయసులో, ఈ చిత్రానికి గాను మోనిషా ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాతి ఆరేళ్లలో దాదాపు 25 సినిమాల్లో నటించింది.

సౌత్ ఇండస్ట్రీలో చిన్న వయుసలోనే అత్యధిక క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో సినీరంగాన్ని ఏలేసే హీరోయిన్ అనుకున్నారు. తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. అందమైన రూపం, చూడచక్కని కళ్లు, మనసును హత్తుకునే నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అయితే అప్పట్లోనే చేతినిండా సినిమాలతో సినీ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకుని ఆమె.. 1992లో అలప్పుజకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో, కారు వెనుక సీటులో నిద్రిస్తున్న మోనిషా తీవ్రంగా గాయపడి, మాట్లాడలేక, ఊపిరి తీసుకోలేకపోయింది. ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. తల్లి ఒడిలో పడుకుని ప్రయాణిస్తున్న మోనిషా, చివరికి తన తల్లి కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయింది.

‘ఉన్నై నేనేచన్ పట్టు పడిచన్’ చిత్రంలో, మోనిషా మధ్యలోనే చనిపోయేలా ఒక విషాద సన్నివేశాన్ని చిత్రీకరించారు. నిజానికి ఆ సినిమా విడుదలైన కొన్ని నెలల తర్వాత ఇది జరిగింది. ఆమె నటించిన, మణివన్నన్ దర్శకత్వం వహించిన “మూన్రావతి కణ్” అనే థ్రిల్లర్ చిత్రం మోనిషా మరణం తర్వాత విడుదలైంది. చాలా చిన్న వయస్సు నుండే వేగంగా ఎదుగుతున్న నటి మోనిషా ఉన్ని, తమిళ చిత్రసీమలో ఎన్నో విజయాలు సాధించాల్సిన సమయంలో ఒక విషాదకరమైన ప్రమాదంలో మరణించారు.

ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

Monisha Unni (1)

Monisha Unni 

ఎక్కువ మంది చదివినవి :  Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..

Follow Us