షాపింగ్ మాల్‌లో ఆ యువతి.. ఏం చేసిందంటే..?

ఇప్పటివరకూ మద్యం తాగి చిందులు వేసిన అమ్మాయిల గురించే విన్నాం. ఇక విమానాల్లో, షాపింగ్‌ మాల్స్‌లో వికృత చర్యలకు పాల్పడిన మగవారి గురించే చదివాం. కానీ తాజాగా ఓ యువతి ఇలాంటి చర్యకు పాల్పడింది. వాషింగ్టన్‌లోని వాల్‌మార్ట్‌ మాల్‌కు వెళ్లిన ఓ యువతి.. అక్కడే ఉన్న ఆలుగడ్డలపై మూత్ర విసర్జన చేసింది. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు ఈ వికార చర్యకు పాల్పడిన యువతి ఫోటోలను విడుదల చేశారు. ఈ సంఘటన పెన్సిల్వేనియా వాల్‌మార్ట్‌ స్టోర్‌లో […]

షాపింగ్ మాల్‌లో ఆ యువతి.. ఏం చేసిందంటే..?
Follow us

| Edited By:

Updated on: Aug 03, 2019 | 10:57 AM

ఇప్పటివరకూ మద్యం తాగి చిందులు వేసిన అమ్మాయిల గురించే విన్నాం. ఇక విమానాల్లో, షాపింగ్‌ మాల్స్‌లో వికృత చర్యలకు పాల్పడిన మగవారి గురించే చదివాం. కానీ తాజాగా ఓ యువతి ఇలాంటి చర్యకు పాల్పడింది. వాషింగ్టన్‌లోని వాల్‌మార్ట్‌ మాల్‌కు వెళ్లిన ఓ యువతి.. అక్కడే ఉన్న ఆలుగడ్డలపై మూత్ర విసర్జన చేసింది. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు ఈ వికార చర్యకు పాల్పడిన యువతి ఫోటోలను విడుదల చేశారు. ఈ సంఘటన పెన్సిల్వేనియా వాల్‌మార్ట్‌ స్టోర్‌లో జరిగింది. మాల్‌ సిబ్బందికి ఫ్లోర్‌లో ఎవరో మూత్రవిసర్జన చేసినట్లు అనుమానం రావడంతో.. సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించారు. దాంతో యువతి చేసిన చండాలం వెలుగు చూసింది. దీనిపై మాల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా సదరు యువతిని గ్రేస్ గా గుర్తించారు పోలీసులు. అయితే ఆమెకు ఇలాంటి పనులు కొత్తేమి కాదని పోలీసులు చెబుతున్నారు. పబ్లిక్‌ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించడం ఆమెకు అలవాటేనని అన్నారు. గతంలో ఈమెపై పలు కేసులు నమోదయ్యాయని చెప్పారు. త్వరలోనే ఆమెను అరెస్టు చేస్తామన్నారు. అయితే గ్రేస్ చర్యలపై నెటిజెన్లు మండిపడుతున్నారు.