AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TeamIndia: కెప్టెన్ ను మార్చాలా.. వద్దా.. అనేది పొట్టి ప్రపంచ కప్ నిర్ణయిస్తుంది: మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా

ఈ సారి తప్పులు జరిగితే.. కెప్టెన్సీ లో మార్పులుండే ఛాన్స్ ఉందని మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా అన్నారు. ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఓడిపోయాక టీం ఇండియా కెప్టెన్ మార్పుపై చాలా చర్చలు వచ్చాయి.

TeamIndia: కెప్టెన్ ను మార్చాలా.. వద్దా.. అనేది పొట్టి ప్రపంచ కప్ నిర్ణయిస్తుంది:  మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా
Team India
Venkata Chari
|

Updated on: Jul 04, 2021 | 9:42 PM

Share

TeamIndia: ఈ సారి తప్పులు జరిగితే.. కెప్టెన్సీ లో మార్పులుండే  ఛాన్స్ ఉందని మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా అన్నారు. ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఓడిపోయాక టీం ఇండియా కెప్టెన్ మార్పుపై చాలా చర్చలు వచ్చాయి. విరాట్ కోహ్లీని మార్చాలని మాజీలు సైతం విమర్శలు గుప్పించారు. రోహిత్ ను కెప్టెన్ గా నియమించాలని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా మాట్లాడారు. టీ20 ప్రపంచ కప్ లో ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలని కోహ్లికి సూచించాడు. అయితే, ఇప్పుడున్న ఇలాంటి పరిస్థితుల్లో సారథ్యాన్ని మార్చడం మంచిది కాదని తెలిపాడు. ‘ఇలాంటి సమయంలో సారథిని మార్చడం మంచింది కాదు. కానీ, కచ్చితంగా హిట్ మ్యాన్ రోహిత్‌ కు సారథిగా ఉండే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్ తో చాలా విషయాలు తెలుస్తాయి. పొట్టి ప్రపంచ కప్ మరో మూడు నాలుగు నెలల్లో రానుంది. ఇంత తక్కువ సమయంలో రోహిత్ ను కెప్టెన్ గా ఉంచితే, జట్టుకు కష్టంగా మారవచ్చు. ఇప్పటికైతే కెప్టెన్నీ లో మార్పులు ఉందకూడదు. హిట్ మ్యాన్ ఇప్పటికే కొన్ని మ్యాచ్ లకు నాయకత్వం వహించాడు. ఆ మ్యాచుల్లో విజయం సాధించి తన సత్తా చాటాడు. అలాగే ఐపీఎల్ లోనూ తన మార్క్ చూసించి ట్రోఫీలు గెలుచుకున్నాడు. తాత్కాలిక కెప్టెన్ గా రోహిత్ నియమించడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఎవరైనా పూర్తిస్థాయి నాయకుడిగా ఉన్నప్పుడే జట్టులో వారి ముద్ర ఉంటుందని’ ఆయన పేర్కొన్నాడు.

ప్రపంచ కప్ ముందు ఇలాంటి నిర్ణయం సరైంది కాదు. అది టీమిండియాకు, విరాట్ కోహ్లీకి, రోహిత్‌కు మంచిది కాదని ఆయన పేర్కొన్నాడు. అయితే నాయకత్వం మార్చాలా వద్దా అని పొట్టి ప్రపంచ కప్ నిర్ణయిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఓటమి తరువాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై చాలా విమర్శలు వచ్చాయి. జట్టు కూర్పుపై కూడా పలువురు ఆరోపణలు చేశారు. అలాగే ఆటగాళ్లపై కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, జట్టులోని ఆటగాళ్లపై అయిష్టాన్ని వెలిబుచ్చాడు. న్యూజిలాండ్ తో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో టీమిండియా అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా వచ్చే నెలలో ఆథిత్య జట్టుతో 5 టెస్టుల సిరీస్ లో తలపడనుంది.

Also Read:

MS Dhoni Marriage Day: పెళ్లి రోజు సందర్భంగా భార్యకు సర్ ప్రైజ్ ఇచ్చిన మిస్టర్ కూల్..!

Lionel Messi: క్రిస్టియానో రొనాల్డో రికార్డ్‌ను బ్రేక్ చేసిన అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ..!