Carlos Brathwaite: వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ కి కరోనా పాజిటివ్..!
West Indies: ఇంగ్లండ్ లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ లో వెస్టిండీస్ స్లార్ ప్లేయర్ కార్లోస్ బ్రాత్ వైట్ కి కరోనా పాజిటివ్ గా తేలింది.
West Indies: ఇంగ్లండ్ లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ లో వెస్టిండీస్ స్లార్ ప్లేయర్ కార్లోస్ బ్రాత్ వైట్ కి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో మరో మ్యాచ్ కి ఆయనను తప్పించారు. వివరాల్లోకి వెళ్తే.. టీ20 బ్లాస్ట్‌లో వార్‌విక్‌షైర్ టీమ్‌కి ఈ వెస్టిండీస్ సీనియర్ ప్లేయర్ ఆడుతున్నాడు. తాజాగా నాటింగామ్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌కి బ్రాత్‌వైట్ స్థానంలో రోబ్ యాట్స్‌ని తీసుకున్నారు. బ్రాత్‌వైట్‌కి కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా సెకండ్ వేవ్ తో చాలా టోర్నీలు రద్దు అయ్యాయి. కొన్ని వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో కొద్దిగా మార్పులు వస్తున్నాయి. అయినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొందరు ఆటగాళ్లు మాత్రం కరోనా బారిన పడుతున్నారు. అలాగే టీ20 బ్లాస్ట్ టోర్నీలోనూ కొన్ని రూల్స్ ఉన్నాయి. కరోనా పాజిటివ్‌గా తేలిన క్రికెటర్ 10 రోజులు క్వారంటైన్ లో ఉండాలి. ఈ కారంణంగానే జులై 9 వరకు ఈ వెస్టిండీస్ స్టార్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. జులై 16, 18న జరిగే మ్యాచ్‌లకి మాత్రం అందుబాటులో ఉంటాడని వార్తలు వస్తున్నాయి. బ్రాత్‌వైట్ ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లాడి 18 వికెట్లు పడగొట్టి.. 104 పరుగులు చేశాడు. కార్లోస్ బ్రాత్ 2016 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో లాస్ట్ ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లు బాది వెస్టిండీస్‌ని గెలిపించాడు. ఆ టోర్నీ తర్వాత కెప్టెన్‌గా వెస్టిండీస్ టీంను నడిపించాడు. అనంతరం 2019 నుంచి అతని కెరీర్ పట్టాలు తప్పింది. చాలాకాలంగా టీంకి దూరంగా ఉంటున్నాడు. ప్రైవేట్ లీగ్ లు ఆడుతున్నాడు.
వెస్టిండీస్ స్లార్ ప్లేయర్ కార్లోస్ బ్రాత్ వైట్ ఇప్పటి వరకు 3 టెస్టులు ఆడి 181 పరుగులు సాధించాడు. అలాగే 44 వన్డేలు ఆడి 558 పరుగులు సాధించాడు. ఇక టీ20లో 41 మ్యాచులు ఆడి, 310 పరుగులు సాధించాడు.
Also Read:
MS Dhoni Marriage Day: పెళ్లి రోజు సందర్భంగా భార్యకు సర్ ప్రైజ్ ఇచ్చిన మిస్టర్ కూల్..!