లైవ్: ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం జిల్లాలోనూ షురూ చేశారు, టీడీపీ-వైసీపీ పోటాపోటీ హడావుడి, భారీగా హౌస్ అరెస్టులు

ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్ హడావుడి షురూ అయింది. శీతాకాలపు చలి గిలిలో టీడీపీ, వైసీపీ పార్టీల పోటాపోటీ చేష్టలు వేడి రగిలిస్తున్నాయి...

లైవ్: ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం జిల్లాలోనూ షురూ చేశారు, టీడీపీ-వైసీపీ పోటాపోటీ హడావుడి, భారీగా హౌస్ అరెస్టులు
Follow us

|

Updated on: Dec 24, 2020 | 12:01 PM

ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్ హడావుడి షురూ అయింది. శీతాకాలపు చలి గిలిలో టీడీపీ, వైసీపీ పార్టీల పోటాపోటీ చేష్టలు వేడి రగిలిస్తున్నాయి. అడుగడుగునా పోలీసుల పహారా, 144 సెక్షన్ నడుమ పలాసలో ఈ ఉదయం నుంచే ఉద్విఘ్నభరిత వాతావరణం నెలకొంది. టీడీపీ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గౌతు లచ్చన్న విగ్రహం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు, విగ్రహ శుద్ది కార్యక్రమానికి వైసీపీ నేతలకూ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గౌతు లచ్చన్న విగ్రహం ముందు చేపట్టదలచిన నిరసన కార్యక్రమానికి టీడీపీ నేతల్ని రానివ్వకుండా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నిమ్మాడలో టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడును, శ్రీకాకుళంలో ఎంపీ రాంమోహన్ నాయుడు, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ను, పలాసలో గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, గౌతు శిరీష లతో పాటు టీడీపీ నేతలను శ్రీకాకుళం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.   శ్రీకాకుళం జిల్లాలో పోటాపోటీ: మంత్రి అప్పలరాజు సెంట్రిక్‌గా.. గౌతులచ్చన్న విగ్రహం ముందు టీడీపీ ఆందోళన, వైసీపీ నేతల శుద్ధి కార్యక్రమం