టీడీపీ నేత కూన రవికుమార్‌ అరెస్ట్‌

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో టీడీపీ నేత కూన రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించిన ఆయనపై కేసు నమోదు అయింది. కూన రవికుమార్‌పై 353, 306, రెడ్‌ విత్‌

  • Tv9 Telugu
  • Publish Date - 4:20 pm, Mon, 2 March 20
టీడీపీ నేత కూన రవికుమార్‌ అరెస్ట్‌

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో టీడీపీ నేత కూన రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించిన ఆయనపై కేసు నమోదు అయింది. కూన రవికుమార్‌పై 353, 306, రెడ్‌ విత్‌ 109 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రవికుమార్‌ తో పాటు మాజీ ఎంపీటీసీ బొంగు వెంకటరత్నంపై కూడా ఆమదాలవలస పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

వీరిద్దరిని ఆమదాలవలస కోర్టులో హాజరు పరచనున్నారు. కాగా శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఇన్‌ఛార్జ్‌ ఈఓపీఆర్‌డీ అప్పలనాయుడుకు ఫోన్‌ చేసి బూతులు తిట్టిన వైనం ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

శ్రీకాకుళం ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ తన నైజాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడే రవికుమార్‌ ఎవరికి పడితే వారిని తిట్టేస్తూ నోటిని కంపు చేసుకుంటుంటారు.. ప్రభుత్వ ఉద్యోగులంటే ఈయనకు మరీ చిన్నచూపు…ఫోన్‌లో ప్రభుత్వ ఉద్యోగిని బండ బూతులు తిట్టడమే కాకుండా బెదిరించారు.. ఇప్పుడా ఆడియో వైరల్‌ కావడంతో రవికుమార్‌ ఎలాంటివారో అందరికీ తెలిసిపోయింది…పచ్చి బూతులు మాట్లాడుతూ హెచ్చరిక చేశారు.. తన మనుషులకు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదంటూ వార్నింగ్‌ ఇచ్చారు.. సరుబుజ్జిలి ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగి వెంకట అప్పలనాయుడును ఇష్టం వచ్చినట్టు తిట్టారు..