Rajinikanth: తమిళ రాజకీయాల్లో సంచలనం.. తలైవా రజినీకాంత్ పార్టీ పేరు, గుర్తు ఖరారు..! వివరాలివే..
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ పేరు ఫిక్స్ అయిందా.? ఆయన పార్టీకి గుర్తు కూడా ఖరారైందా.? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
Rajinikanth Party: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ పేరు ఫిక్స్ అయిందా.? ఆయన పార్టీకి గుర్తు కూడా ఖరారైందా.? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రజినీకాంత్ పార్టీకి ‘మక్కల్ సేవై కర్చీ'(ప్రజాసేవ పార్టీ) అనే పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. అలాగే ఆయన పార్టీకి ఆటో గుర్తును ఎలక్షన్ కమిషన్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో రజినీకాంత్ పార్టీ ‘మక్కల్ సేవై కర్చీ’ పోటీ చేసే అవకాశముంది.
అంతకుముందు రజినీ ‘బాబా లోగో’ను అడగగా.. దానిని కేటాయించడానికి ఎన్నికల సంఘం నిరాకరించింది. కాగా, నటుడు రజనీకాంత్ కొద్ది రోజుల క్రితం.. తాను కొత్త పార్టీని ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నానని. కొత్త పార్టీకి చీఫ్ కో-ఆర్డినేటర్‌గా అర్జున మూర్తిని, సూపర్‌వైజర్‌గా తమిళ్రూవి మణియన్‌ను నియమించినట్లు అధికారిక ప్రకటన చేసిన సంగతి విదితమే. కాగా, పార్టీ పేరు, జెండా, ఇతర విషయాలను రజినీకాంత్ డిసెంబర్ 31న అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు.
Also Read: