మగువలకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ఫిబ్రవరి 2021 నాటికి రూ. 42,000 చేరుకునే అవకాశం..!

మగువలకు గుడ్ న్యూస్. దేశంలో గత మూడు నెలల నుంచి పసిడి ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. మ్యారేజ్ సీజన్‌లో బంగారం, వెండికి డిమాండ్ పెరిగినప్పటికీ..

మగువలకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ఫిబ్రవరి 2021 నాటికి రూ. 42,000 చేరుకునే అవకాశం..!
Follow us

|

Updated on: Dec 14, 2020 | 12:47 PM

Gold And Silver Prices: మగువలకు గుడ్ న్యూస్. దేశంలో గత మూడు నెలల నుంచి పసిడి ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. మ్యారేజ్ సీజన్‌లో బంగారం, వెండికి డిమాండ్ పెరిగినప్పటికీ.. ధరల క్షీణత మాత్రం అలాగే ఉంది. చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం నాడు బులియన్ మార్కెట్లలో బంగారం ధర మరోసారి క్షీణించింది. ప్రస్తుతం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.102 తగ్గి రూ.48,594కి చేరుకుంది. అదే విధంగా పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తూ.. కిలో రూ. 16 తగ్గి రూ.62,734కు చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం $ 1,836 వద్ద, వెండి $ 23.92 దగ్గర స్థిరంగా కొనసాగుతున్నాయి.  

ఇదిలా ఉంటే ఆగష్టులో 10 గ్రాముల బంగారం ధర గరిష్టంగా రూ. 56,254కు చేరుకుంది. అదే విధంగా వెండి కిలో రూ. 76,008కి చేరుకుంది. కానీ అప్పటి నుండి రెండింటి ధరలు కూడా గణనీయంగా పడుతూ వచ్చాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 49,290 వద్ద ముగియడంతో.. ఇప్పటిదాకా రికార్డు స్థాయిలో రూ .6964కు పడిపోయింది. అదేవిధంగా శుక్రవారం కిలో వెండి ధర రూ. 63,600 వద్ద ముగిసింది. దీనితో ఈ మూడు నెలల్లో వెండి సుమారు రూ .12,408 తగ్గింది.

బంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణం కరోనా వ్యాక్సిన్ అని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. కరోనాకు వ్యాక్సిన్ వస్తుందన్న వార్తల దృష్ట్యా గత రోజులుగా పసిడి ధరలు కాస్తా తగ్గుతూ వస్తూన్నాయి. వెండి కూడా బంగారం దిశలోనే నడుస్తుంది. పెట్టుబడిదారులు బంగారం నుండి డబ్బును ఉపసంహరించుకుని స్టాక్ మార్కెట్, ఇతర పెట్టుబడులలో పెడుతున్నారు, దీని కారణంగా బంగారం అమ్మకం ప్రారంభమైంది. బంగారం పట్టు తగ్గుతోంది, ఈ కారణంగా బంగారం ధర తగ్గుతోంది. ఇదే కొనసాగిస్తే ఫిబ్రవరి 2021 నాటికి 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 42,000కి పడిపోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. వెండి ధర కూడా రూ. 62,000కి చేరుకుంటుందని తెలిపారు.

Also Read:

బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజిత్.! రన్నరప్ సోహైల్.. టాప్ 3లో అఖిల్.. చివరి స్థానంతో సరిపెట్టుకున్న అరియానా..!

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇకపై డిజిటల్‌ ఓటరు కార్డు..! ప్రణాళికలు సిద్ధం..

బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి 24×7 ఆర్టీజీఎస్‌ సేవలు.. ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్..