తొలి దశలో కోటి మందికి టీకా.. హెల్త్‌కేర్‌ వర్కర్లకే మొదటి ప్రాధాన్యత.. కోవిడ్ వ్యాక్సినేషన్‌కు ఏపీ ప్రభుత్వం సిద్ధం.!

కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నెలలో రాష్ట్రాలకు టీకా పంపిణీ జరగనుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు సన్నద్ధమవుతోంది.

తొలి దశలో కోటి మందికి టీకా.. హెల్త్‌కేర్‌ వర్కర్లకే మొదటి ప్రాధాన్యత.. కోవిడ్ వ్యాక్సినేషన్‌కు ఏపీ ప్రభుత్వం సిద్ధం.!
Follow us

|

Updated on: Dec 14, 2020 | 7:38 AM

Covid Vaccine: కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నెలలో రాష్ట్రాలకు టీకా పంపిణీ జరగనుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు సన్నద్ధమవుతోంది. కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వచ్చిన వెంటనే తొలి విడతగా కోటి మందికి టీకా వేసేందుకు కావాల్సిన మౌలిక వసతులను సమకూరుస్తోంది. ఇందులో భాగంగానే ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే 13 జిల్లాల కలెక్టర్లతో పలు దఫాల్లో చర్చలు జరిపారు. రాష్ట్రంలో 4,762 కేంద్రాలను ఏర్పాటు చేసి 30 రోజుల్లో మొత్తం 1,42,857 సెషన్స్ నిర్వహించనున్నారు. వచ్చే వ్యాక్సిన్‌ డోసుల ఆధారంగా ఒక్కో సెషన్‌లో 70 మందికి చొప్పున నెలలో మొత్తం కోటి మందికి టీకా వేయనున్నారు. ఈ ప్రక్రియను మొత్తం నెల రోజుల్లో పూర్తి అయ్యేలా చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read: బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజిత్.! రన్నరప్ సోహైల్.. టాప్ 3లో అఖిల్.. చివరి స్థానంతో సరిపెట్టుకున్న అరియానా..!

ముందుగా ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ కేర్ సిబ్బందికి, అంగన్‌వాడీ వర్కర్స్‌కు టీకా వేయనుండగా.. ఆ తర్వాత పోలీసులు, శానిటేషన్ వర్కర్లు, వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వ్యాక్సిన్ వేస్తారు. టీకా వేయించుకున్న 6 నుంచి 8 వారాల తర్వాత యాంటీబాడీస్ వృద్ధి చెందే అవకాశం ఉందని.. అంతవరకూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read: బిగ్ బాస్ 4: దేత్త‌డి పాప సేఫ్.. మోనాల్ ఎలిమినేట్.! రసవత్తరంగా మారనున్న ఫినాలే పోటీ.. టాప్ 2లో ఎవరుంటారో.?

కాగా, కోవిడ్ టీకా నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కరోనా నివారణ, వ్యాక్సిన్, పలు స్థాయిల్లో టీకా నిర్వహణ, మానవ వనరులు వారికి శిక్షణ, కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ (కొవిన్) సాఫ్ట్వేర్, వ్యాక్సిన్ అందించే ప్రక్రియ, టీకా నిల్వలకు సంబంధించిన శీతల గిడ్డంగుల వ్యవస్థ నిర్వహణ, టీకా దుష్ప్రభావం ఎదుర్కోవడం, పర్యవేక్షణ వంటి అంశాలకు సంబంధించిన విషయాలను కేంద్ర ప్రభుత్వం మొత్తం 113 పేజీల మార్గదర్శకాలలో పొందుపరిచింది.

Also Read: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి 24×7 ఆర్టీజీఎస్‌ సేవలు.. ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్..

కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మొత్తం 23 మంత్రిత్వ శాఖలను భాగస్వామ్యం చేయడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియలో వాటి పాత్ర ఏ విధంగా ఉండాలనే విషయంపైనా స్పష్టమైన సూచనలు చేసింది. రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించాలని సూచించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు టీకాను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కొవిన్ సాఫ్ట్ వేర్ ద్వారా గుర్తించిన లబ్దిదారులకే టీకాలు వేయాలని, సాధారణ పౌరులు వ్యాక్సిన్ కోసం ‘కొవిన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోదలిస్తే గుర్తింపు కార్డు తప్పనిసరి’ అని పేర్కొన్నారు.

Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇకపై డిజిటల్‌ ఓటరు కార్డు..! ప్రణాళికలు సిద్ధం..