లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకున్న తాలిబన్ టెర్రరిస్టు చీఫ్..తాజాగా వెలుగులోకి వచ్చిన సరికొత్త నిజాలు..
పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దుల్లో 2016లో అమెరికా డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ హెడ్ ముల్లా అక్తర్ మాన్సూర్ మరణించాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవల్స వస్తుందంటే..
పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దుల్లో 2016లో అమెరికా డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ హెడ్ ముల్లా అక్తర్ మాన్సూర్ మరణించాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవల్స వస్తుందంటే.. ఈ దాడిలో మరణించిన ముల్లా అక్తర్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఆయన మరణించక ముందు పాకిస్థాన్‌లో నకిలీ గుర్తింపుతో రూ. 3 లక్షలు పెట్టి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకున్నట్టు తాజాగా బయటపడింది. సామాన్యులు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోవడంలో పెద్ద వింత లేకపోయినా.. తాలిబన్ హెడ్‌గా ఉన్న వ్యక్తి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకున్నాడంటే ఆశ్చర్యం వ్యక్తం చేయక తప్పదు.
ఇక దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ వార్త ప్రమోషన్ కింద చాలా బాగా ఉపయోగపడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.