తాజ్‌మహల్ సందర్శనకు నో పర్మిషన్…
ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ ముగిసి అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు టూరిస్టు ప్లేసులను సోమవారం నుంచి పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ ముగిసి అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు టూరిస్టు ప్లేసులను సోమవారం నుంచి పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకున్న ఆశావహులు ఇంకొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితుల ఏర్పడ్డాయి. యూపీలోని ఆగ్రాలో కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో.. తాజ్‌మహల్ సహా సిటీలోని ఇతర చారిత్రక కట్టడాలను మూసివేసే ఉంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ముందు తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి ఇచ్చినప్పటికీ.. మూసివేసే ఉంచాలని జిల్లా యంత్రాంగం చివరి నిమిషంలో ఆదేశాలు జారీ చేసింది.
కాగా ఆగ్రా జిల్లాలో గత నాలుగు రోజుల్లో 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 71 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఈ సమయంలో చారిత్రక కట్టడాలను తెరిచి సందర్శకులకు అనుమతిస్తే.. వైరస్ ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.