బాబాయి, అబ్బాయి కాంబినేషన్‌లో సూపర్ హిట్ మూవీ రీమేక్?
టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయనకంటూ ఓ స్పెషల్ మేనరిజాన్ని మెయిన్‌టైన్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఆకర్షిస్తూంటారు వెంకీ. ప్రస్తుతం ఈ మధ్య టాలీవుడ్ యంగ్ హీరోస్‌తో వరుసగా మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ...
టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయనకంటూ ఓ స్పెషల్ మేనరిజాన్ని మెయిన్‌టైన్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఆకర్షిస్తూంటారు వెంకీ. ప్రస్తుతం ఈ మధ్య టాలీవుడ్ యంగ్ హీరోస్‌తో వరుసగా మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ హిట్స్ సాధిస్తున్నారు. ఇప్పుడు తాజాగా రానాతో కలిసి వెంకీ ఓ సినిమాలో నటించబోతున్నాడంటూ పలు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం వెంకీ ‘నారప్ప’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా, ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను కలిసి నిర్మిస్తున్నారు. దీంతో పాటు రీసెంట్‌గా మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనన్ కోషియమ్’ సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట వెంకటేష్. ఈ సినిమాలో రానా, వెంకీలు కలిసి నటించబోతున్నారట. కాగా ఇప్పటికే గతంలో రానాతో కలిసి వెంకటేష్ ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలనుకున్నారు. కానీ అప్పటి నుంచి సరైన కథ దొరకలేదు. వీరిద్దరి కాంబోలో సినిమా కోసం ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.
Read More:
గోల్డ్ కొనాలనుకునే వారికి ఆర్బీఐ బంపర్ ఆఫర్..