AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశ్వంలో నక్షత్రానికి సుశాంత్ పేరు

సుశాంత్‌ ఇష్టాలు తెలిసిన ఓ వీరాభిమాని ఆయనకు గొప్పగ నివాళ్లు అర్పించాలనుకున్నాడు. అమెరికాలో ఉంటున్న రక్ష అనే అభిమాని ఒక నక్షత్రాన్ని కొనుగోలు చేసి దానికి సుశాంత్‌ పేరు పెట్టారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.

విశ్వంలో నక్షత్రానికి సుశాంత్ పేరు
Balaraju Goud
|

Updated on: Jul 06, 2020 | 10:57 PM

Share

తన నటనతో అందరినీ ఆకట్టుకున్న బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ విద్యలోనూ మంచి ప్రావీణ్యుడు. అటు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాడు సుశాంత్‌ సింగ్‌. అంతేకాదు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కు ఖగోళం అంటే ఎంత ఆసక్తి ఉండేది. నటుడిగా మారిన తర్వాత కూడా ఆస్ట్రో ఫిజిక్స్‌పై సుశాంత్‌ అనేక అధ్యయనాలు చేశారు. విశ్వంలో ఉండే తారా మండలాన్ని చూడటానికి ఖరీదైన ఓ టెలిస్కోప్‌ను కూడా కొనుగోలు చేశారు. తనకు వీలు దొరికినప్పుడల్లా ఆ టెలిస్కోప్ నుంచి విశ్వంలోకి చూస్తూ ఉండే వారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఏకంగా సుశాంత్ చంద్రమండలంపై కూడా భూమిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

సుశాంత్‌ ఇష్టాలు తెలిసిన ఓ వీరాభిమాని ఆయనకు గొప్పగ నివాళ్లు అర్పించాలనుకున్నాడు. అమెరికాలో ఉంటున్న రక్ష అనే అభిమాని ఒక నక్షత్రాన్ని కొనుగోలు చేసి దానికి సుశాంత్‌ పేరు పెట్టారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. విశ్వంలో ఉండే తారల్లో ఒకటైన RA 22.121 కు జూన్ 25,2020 నుంచి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌గా నామకరణం చేశారు. ఆ మేరకు ఖగోళ శాస్త్ర సంస్థ హక్కులు కల్పించింది.

‘సుశాంత్‌ అద్భుతమైన వ్యక్తి. అతనికి నివాళులు అర్పించడంలో కొంత ఆలస్యం చేశాను. ఈ చీకటి ప్రపంచంలో ఆయన ఒక స్వచ్ఛమైన రత్నంలా మెరవాలి. ఆయన పేరు మీద ఉన్న నక్షత్రాన్ని ఆయన టెలిస్కోప్‌తో కొనడం చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి ఆ తార మరింత ప్రకాశవంతంగా మెరువాలని తన ట్వీట్టర్ లో పేర్కొన్నారు. ఆ నక్షత్రానికి సంబంధించి పూర్తి హక్కులు, కాపీరైట్స్ పొందినట్లు రక్ష వెల్లడించారు.

sushant had always been so fond of the stars & thus i found it quite fitting to name one after him. ? i shall forever be blessed to have witnessed such a beautiful & profound soul. may you continue to shine brightest! ?@itsSSR#sushantsinghrajput #sushantinourheartsforever pic.twitter.com/c92u9yz1Sg

— raksha ♡ (@xAngelWingz) June 29, 2020 despite being so late in appreciating his value, sushant has positively impacted my life in innumberable ways. he was an absolute gem; far too pure & precious for this dark world. i definitely would have loved to see you excitedly locate your star through that telescope of yours! pic.twitter.com/YL5he7OnIE

— raksha ♡ (@xAngelWingz) June 29, 2020