కొవిడ్ రూల్స్ పాటిస్తూ వర్సిటీ ఫైనల్ ఇయర్ పరీక్షలు

కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రకాల పరీక్షలు నిలిచిపోయాయి. అయితే, యూనివర్సిటీలు, వాటి అనుబంధ సంస్థల్లో ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది.

కొవిడ్ రూల్స్ పాటిస్తూ వర్సిటీ ఫైనల్ ఇయర్ పరీక్షలు
Balaraju Goud

|

Jul 06, 2020 | 10:24 PM

కరోనా వైరస్ ధాటికి విద్యా వ్యవస్థ స్వరూపమే మారిపోయింది. విద్యాసంవత్సరం ముగిసినా ఎగ్జామ్స్ నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అన్ని రకాల పరీక్షలు నిలిచిపోయాయి. అయితే, యూనివర్సిటీలు, వాటి అనుబంధ సంస్థల్లో ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం అనుమతిచ్చింది. ఈ మేరకు కేంద్ర ఉన్నత విద్యాశాఖ అధికారికి లేఖ రాసినట్లు వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించింది. యూజీసీ మార్గదర్శకాలు, వర్సిటీలకు సంబంధించిన అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం తుది పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనని పేర్కొంది. మరోవైపు కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించడం ద్వారా వైరస్ వ్యాప్తి కలుగుతుందని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలను రద్దు చేసి గ్రేడింగ్ ద్వారా విద్యార్థులను ఉత్తీర్ణులను చేసింది. తాజగా కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో అన్ని వర్సిటీ స్థాయి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. కొవిడ్‌ రూల్స్ కి అనుగుణంగా విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అయా వర్సిటీలకు ఎంహెచ్‌ఏ సూచించింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu