Raisin water: వేసవిలో ఉదయాన్నే నానబెట్టిన కిస్మిస్ నీళ్లతో పాటు తింటే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ తెలుసా?
నానబెట్టిన ఎండు ద్రాక్ష శక్తివంతమైన పోషకాల గని. వీటిని రాత్రి నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినడం వలన జీర్ణశక్తి, గుండె ఆరోగ్యం మెరుగుపడతాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది, శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ చిన్న పండ్లను మీ దినచర్యలో భాగం చేసుకోండి.

ద్రాక్షలు.. చూసేందుకు చాలా చిన్నసైజు పండ్లు.. కానీ, ఇది శక్తివంతమైన పోషకాలతో నిండినవి. ఎండు ద్రాక్ష తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఇందులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. వాటిని రాత్రి నీటిలో నానబెట్టి, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తినడం ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. నిపుణుల ప్రకారం, నానబెట్టిన ద్రాక్షలను తినడం వల్ల శరీరంలో డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శక్తి పెరుగుతుంది. పూర్తి ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం…
నానబెట్టి కిస్మిస్ తినడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది, గట్ హెల్త్ మెరుగవుతుంది. ఇందులో వాటర్ కంటెంట్, ఫైబర్ సమృద్దిగా ఉండటం వలన మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. నానబెట్టిన కిస్మిస్లో పొటాషియం,ఇతర సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి. దీని వలన గుండె పనితీరు మెరుగవుతుంది. నానబెట్టిన ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రణలో సహాయపడతాయి. దీనివల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
నానబెట్టిన ద్రాక్షలు రుచి మాత్రమే కాకుండా ఫైబర్ కారణంగా కడుపును సక్రమంగా ఉంచి, పేగు సమస్యలు, కడుపు నిండినట్లు అనిపించడంలో సహాయపడతాయి. మలబద్ధకం సమస్యను నివారించడంలో ఇది ఫలవంతంగా పని చేస్తుంది. నానబెట్టిన ఎండుద్రాక్షలో నేచురల్ షుగర్స్‌తో పాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండటం వలన తక్షణ ఎనర్జీ లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ నానబెట్టిన ఎండు ద్రాక్ష తినడం వలన శరీరానికి సమృద్దిగా లభిస్తాయి. స్కిన్ హెల్త్ మెరుగవుతుంది. నానబెట్టిన ఎండు ద్రాక్ష తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ మితంగా తీసుకోవడం ఎంతో ముఖ్యం.
నానబెట్టిన ద్రాక్షలు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు ఉండటంతో ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది. ప్రతిరోజు ఖాళీ కడుపుతో నానబెట్టిన ద్రాక్షలు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఉద్యోగ, చదువులు లేదా వ్యాయామంలో అలసట తక్కువగా ఉంటుంది. అదనంగా, ఇది బోన్లు, దంతాల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజు రాత్రి నానబెట్టి, ఉదయం 5–10 ద్రాక్షలు తినడం, శక్తివంతమైన, ఆరోగ్యకరమైన అలవాటు. ఇది శరీరానికి, చర్మానికి, హృదయానికి, జీర్ణక్రియకు, ఇమ్మ్యూనిటీకి ఎంతో మేలు చేస్తుంది.
మరిన్నిలైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




