CoronaVirus : కోవిడ్ బాధితుల ఇళ్ల బయట పోస్టర్లు వద్దు, కీలక తీర్పు వెలువరించిన అత్యున్నత న్యాయస్థానం
కరోనా బాధితులు ఇళ్ల బయట పోస్టర్లు అంటించవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో విపత్తు నిర్వహణ చట్టం కింద
కరోనా బాధితులు ఇళ్ల బయట పోస్టర్లు అంటించవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో విపత్తు నిర్వహణ చట్టం కింద అధికారిక ఆదేశాలు జారీ అయితే అప్పుడు పోస్టర్లు అంటించొచ్చని సూచించింది. దేశ వ్యాప్తంగా కొవిడ్ నియమ నిబంధనలు… ఒకే విధంగా ఉండేలా ఆదేశాలివ్వాలని, కరోనా బాధితుల ఇళ్ల బయట పోస్టర్లు అంటించే విధానాన్ని తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఈ నెల 3న విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా పైన పేర్కొన్న విధంగా తీర్పు వెలువరించింది.
కొవిడ్ మార్గదర్శకాల్లో బాధితుల ఇళ్లపై పోస్టర్లు అంటించాలన్న రూల్ ఏదీ లేదని, అయితే వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కొన్ని రాష్ట్రాలు ఈ విధానంలో ముందుకు వెళ్తున్నాయని విచారణ సమయంలో కేంద్రం సుప్రీం ధర్మాసనానికి తెలిపింది. దీనికి స్పందించిన న్యాయమూర్తులు.. బాధితుల ఇళ్ల బయట పోస్టర్లు అతికిస్తే.. వారిని తక్కువగా పరిగణిస్తున్నారనే భావనే కలుగుతుందని వ్యాఖ్యానించారు. వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా రక్షించడానికే ఈ విధంగా చేయాల్సి వచ్చిందని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయని పేర్కొంది.
Also Read :
Bigg Boss Telugu 4 : అభిజీత్ అభిమానుల ఆశలు గల్లంతు, తొలిసారి తెలుగు బిగ్ బాస్ కిరీటం ‘ఆమె’ ఖాతాలో
ఆ కుటుంబం అధికారంలో ఉంటే..వర్షాలు పుష్కలం..వైఎస్సార్, జగన్‌లపై ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు