Singer Sunitha: పెళ్లి ఆలోచన రాగానే మొదటగా నా పిల్లలే గుర్తొచ్చారు.. తన రెండో పెళ్లిపై స్పందించిన సింగర్ సునీత..
Sunitha About Her Marriage: టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ గాయనీ సునీత ఇటీవల వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి వివాహం...
Sunitha About Her Marriage: టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ గాయనీ సునీత ఇటీవల వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి వివాహం రద్దు తర్వాత చాలా ఏళ్ల పాటు ఒంటరిగా ఉన్న సునీత ఎట్టకేలకు రెండో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే సునీత వివాహం ఎంతో వైభవంగా జరిగింది. శంషాబాద్‌లోని ఒక దేవాలయంలో జరిగిన ఈ వివాహ వేడుకకు చిత్ర సీమతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఇక తన పెళ్లి గురించి అధికారికంగా మాట్లాడని సునీత తాజాగా ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను పంచుకున్నారు. రామ్‌తో పెళ్లి ఆలోచన వచ్చినప్పుడు మొదట పిల్లలే గుర్చొచ్చారని, తాను తీసుకునే నిర్ణయంతో వారు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆ ఆలోచన వచ్చిందని సునీత చెప్పుకొచ్చారు. ఇక జీవిత భాగస్వామి ఉండటం కూడా ముఖ్యమని. జీవితంలో ఎదురయ్యే ప్రతి క్లిష్ట సందర్భంలో మనకు తోడుగా నిలిచేవారు.. మన కష్టసుఖాల్లో అండగా నిలిచే వ్యక్తి భాగస్వామిగా దొరకడం ఎంతో అదృష్టం. రామ్ రూపంలో తనకు ఆ అదృష్టం లభించిందని సునీత వెల్లడించారు. రామ్ తనకు చాలా ఏళ్ల క్రితమే పరిచయమని, తన సోషల్ మీడియా అకౌంట్స్‌ని చూసుకునే వారని సునీత తెలిపారు. అంతేకాకుండా పిల్లలు తన పెళ్లి విషయంలో ఎలా స్పందించారన్నదానిపై సునీత మాట్లాడుతూ.. ‘నా తల్లి దండ్రులు ఎన్నో ఏళ్లుగా నన్ను వివాహం చేసుకోవాల్సిందిగా కోరారు. కానీ పిల్లలను దృష్టిలో పెట్టుకుని వారి నిర్ణయాన్ని పక్కకు పెడుతూ వచ్చాను. కానీ ఇప్పుడు వారు పెద్దవారయ్యారు.. పరిస్థితులను చక్కగా అర్ధం చేసుకునే పరిణీతి వారిలో ఉంది. ఇక రామ్‌ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని వారితో చెప్పినప్పుడు.. వారు నన్ను కౌగిలించుకుని.. ఈ నిర్ణయం తమకు ఎంతో సంతోషాన్నిస్తుంది అని చెప్పారు. నన్ను ఇంత బాగా అర్థం చేసుకునే పిల్లలు లభించడం ఎంతో అదృష్టం’ అంటూ చెప్పుకొచ్చింది సునీత.
Also Read: Uppena Movie : తీరాన్ని తాకడానికి సిద్దమైన ‘ఉప్పెన’.. టీజర్ రిలీజ్ చేయనున్న చిత్రయూనిట్