మరోసారి హీరోగా మారనున్న సునీల్. ‘ఆహా’ ఓటీటీలో వచ్చిన కన్నడ సినిమాను రీమేక్ చేయనున్న సునీల్.

తాజా సమాచారం ప్రకారం సునీల్ మరోసారి హీరోగా మారనున్నట్లు తెలుస్తోంది. ‘ఆహా’ ఓటీటీలో విడుదలైన ‘బెల్ బాటమ్’ చిత్రాన్ని సునీల్ రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

  • Narender Vaitla
  • Publish Date - 5:08 pm, Tue, 22 December 20
మరోసారి హీరోగా మారనున్న సునీల్. ‘ఆహా’ ఓటీటీలో వచ్చిన కన్నడ సినిమాను రీమేక్ చేయనున్న సునీల్.

Sunil planning to remake bell bottom movie: కమెడియన్‌గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు నటుడు సునీల్. తనదైన పంచ్‌ డైలాగ్‌లతో సరికొత్త హాస్యానికి అర్థం చెప్పాడీ భీమవరం బుల్లోడు. ఇక హాస్యనటుడిగా కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే సునీల్ హీరోగా మారాడు. ‘అందాల రాముడు’ చిత్రంతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సునీల్.. హీరోగా కూడా మంచి మార్కులే కొట్టేశాడు. ఇక ‘పూల రంగడు’తో మరోసారి ఆకట్టుకున్న సునీల్ ఆ తర్వాత అనుకున్న స్థాయిలో అలరించలేకపోయాడు. దీంతో తన పంథాను మార్చుకుని మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు మొదలుపెట్టారు.

అయితే తాజా సమాచారం ప్రకారం సునీల్ మరోసారి హీరోగా మారనున్నట్లు తెలుస్తోంది. ‘ఆహా’ ఓటీటీలో విడుదలైన ‘బెల్ బాటమ్’ చిత్రాన్ని సునీల్ రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. రిషబ్ శెట్టి హీరోగా కన్నడలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. దీంతో సునీల్ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని ఓ టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే సునీల్ ప్రస్తుతం బన్నీ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’తో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నాడు.