సాయంత్రమే డ్యూటీలో చేరాడు.. తెల్లారేసరికి విగతజీవిగా మారాడు..
విద్యుత్ కేంద్రం నుంచి 8 మంది సురక్షితంగా బయటకు రాగా మరో 9 మంది అందులోనే చిక్కుకుపోయారు. వీరిలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మిగతా నలుగురి ఆచూకీ కోసం అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. చనిపొయినవారిలో సుందర్ నాయక్(35)ను మొదటగా గుర్తించారు అధికారులు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో ఈ ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది విద్యుత్ సిబ్బంది చిక్కుకున్నారు. కాగా, శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పొగలు అలుముకోవడంతో అధికారులు వెంటనే ఉత్పత్తిని నిలిపివేశారు. మంటలు ఆరిపోగా పొగలు మాత్రం దట్టంగా అలుముకున్నాయి. విద్యుత్ కేంద్రం నుంచి 8 మంది సురక్షితంగా బయటకు రాగా మరో 9 మంది అందులోనే చిక్కుకుపోయారు. వీరిలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మిగతా నలుగురి ఆచూకీ కోసం అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. చనిపొయినవారిలో సుందర్ నాయక్(35)ను మొదటగా గుర్తించారు అధికారులు.
అయితే, మృతుడు సుందర్ నాయక్‌ది సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జగన తండా. భార్య ప్రమీల ఇద్దరు కూతుళ్లు మనస్వి, నిహస్వి ఉన్నారు. నెల రోజులక్రితం కరోనా పాజిటివ్‌గా తేలడంతో సుందర్ నాయక్ సొంతూరుకు వచ్చి 15 రోజులు హోం క్వారైంటన్‌లో ఉండి కరోనా నుంచి కోలుకున్నాడు. నిన్న రాత్రే 9 గంటలకు విద్యుత్ కేంద్రంలో విధులకు హాజరయ్యారు. తెల్లారేసరికి ఇలా విగతజీవిగా మారాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సాయంత్రం డ్యూటీకి వెళ్లోస్తానంటూ చెప్పిన వ్యక్తి తెల్లారేసరికి ప్రాణాలతో లేకపోవడంతో ఆ కుటుంబం కన్నీమున్నీరుగా విలపిస్తోంది. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.