లాక్‌డౌన్ నేపథ్యంలో.. సజీవంగా సూట్ కేసులో..!

లాక్‌డౌన్ నేపథ్యంలో.. సజీవంగా సూట్ కేసులో..!

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడికక్కడ కొత్త వ్యక్తులను గ్రామాల్లోకి,

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 13, 2020 | 12:39 PM

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడికక్కడ కొత్త వ్యక్తులను గ్రామాల్లోకి, అపార్ట్‌మెంట్లలోకి రానివ్వడం లేదు. మంగళూరు ఆర్యసమాజ రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే యువకుడు ఒంటరిగా ఉండలేక మిత్రుడిని తన ఫ్లాట్‌కు తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలను అపార్ట్‌మెంట్‌వాసులు అడ్డుకున్నారు.

కాగా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బయటి వ్యక్తులెవ్వరినీ తీసుకురాకూడదంటూ అపార్ట్‌మెంట్‌లో ఆంక్షలు విధించారు. అందులో ఓ ఫ్లాట్‌లో ఉంటున్న యువకుడు ఆదివారం బయటికి వెళ్లి భారీ సూట్‌కేసుతో తిరిగొచ్చాడు. అపార్ట్‌మెంట్‌ రెసిడెన్సీ సభ్యులు బలవంతంగా సూట్‌కేసును తెరిపించగా, అందులో అతడి మిత్రుడు కనిపించాడు. వారి ఫిర్యాదు మేరకు కద్రి పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు.

Also Read: లాక్ డౌన్ నేపథ్యంలో.. కర్ఫ్యూ పాస్‌లు అడిగారని.. పోలీసు చేయి నరికేశారు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu