AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. రక్తపు మడుగులో పసిబిడ్డ!

ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. అభం శుభం తెలియని ఓ పసిబిడ్డ కన్నుమూసింది. ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లిన ఓ కుక్క అప్పుడే పుట్టిన బిడ్డను చంపేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఫరూకాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫరూకాబాద్‌కి చెందిన రవికుమార్ అనే వ్యక్తి తన భార్య కాంచనకు నొప్పులు రావటంతో ఆకాశ గంగ అనే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. కాంచన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు సిజేరియన్ చేశారు. అనంతరం ఆమెను వార్డుకు తరలించారు. […]

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. రక్తపు మడుగులో పసిబిడ్డ!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 16, 2020 | 4:09 PM

Share

ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. అభం శుభం తెలియని ఓ పసిబిడ్డ కన్నుమూసింది. ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లిన ఓ కుక్క అప్పుడే పుట్టిన బిడ్డను చంపేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఫరూకాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫరూకాబాద్‌కి చెందిన రవికుమార్ అనే వ్యక్తి తన భార్య కాంచనకు నొప్పులు రావటంతో ఆకాశ గంగ అనే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. కాంచన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు సిజేరియన్ చేశారు. అనంతరం ఆమెను వార్డుకు తరలించారు. అయితే పసిబిడ్డను మాత్రం ఆపరేషన్ థియేటర్‌లోనే ఉంచారు. అయితే కొద్దిసేపటికి ఆపరేషన్‌ థియేటర్‌లో నుంచి కుక్క రావడం గమనించిన కొందరు గట్టిగా అరిచారు. హుటాహుటిన అందరూ వచ్చి చూడగా.. పసిబిడ్డ రక్తపు మడుగులో కింద పడిఉన్నాడు. బాబును పరీక్షించగా కుక్క గాయాలకు బిడ్డ కన్న మూశాడని తేల్చారు.

అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే.. బాబు మరణించాడని తండ్రి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో.. ఆస్పత్రి యాజమాన్యం.. గొడవచేయొద్దని, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తామని చెప్పారు. దీంతో పసిబిడ్డ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించి, పసిబిడ్డ చావుకు కారణమైన ఆస్పత్రి సిబ్బిందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అంతేకాకుండా.. సరైన పత్రాలు, లైసెన్స్ లేని కారణంగా ఆస్పత్రిని మూసివేయాలని ఫరూకాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.

Follow Us
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే
ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తినాల్సిన స్పాంజి లాంటి పుల్లట్లు
ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తినాల్సిన స్పాంజి లాంటి పుల్లట్లు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీ ఉద్యోగాలు.. UPSCలో ఉద్యోగ అవకాశాలు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీ ఉద్యోగాలు.. UPSCలో ఉద్యోగ అవకాశాలు
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. ఈ యాప్ ద్వారానే..
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. ఈ యాప్ ద్వారానే..
అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండా ముగ్గురు మృతి
అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండా ముగ్గురు మృతి
ప్రాణాలు తీస్తున్న ఫోన్లు.. ప్రణవి విషయంలో ఏం జరిగింది?
ప్రాణాలు తీస్తున్న ఫోన్లు.. ప్రణవి విషయంలో ఏం జరిగింది?
ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
హోటళ్లలో 13వ నంబర్ రూమ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదీ!
హోటళ్లలో 13వ నంబర్ రూమ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదీ!
ప్రేక్షకుల ముందుకు మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సిరీస్స్..
ప్రేక్షకుల ముందుకు మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సిరీస్స్..
రోడ్డుపై పోలీసుల సడెన్ చెకింగ్‌.. ఓ స్కూటీని ఆపి చెక్‌ చేయగా షాక్
రోడ్డుపై పోలీసుల సడెన్ చెకింగ్‌.. ఓ స్కూటీని ఆపి చెక్‌ చేయగా షాక్