బోటులో వంద కేజీల హెరాయిన్‌.. శ్రీలంక నుంచి పాక్‌ తరలిస్తుండగా పట్టుకున్న భారత గస్తీ దళం

అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్‌ను ఇండియన్ కోస్టల్ గార్డ్స్ పట్టుకున్నారు. శ్రీలంకకు చెందిన ఓ బోటు ద్వారా పాకిస్తాన్‌కు రవాణా చేస్తున్న వంద కేజీల హెరాయిన్‌ను భారత తీర గస్తీ దళం స్వాధీనం చేసుకుంది. తమిళనాడులోని తూత్తుకుడి సమీపంలో ఈ నెల 17 నుంచి తొమ్మిది రోజుల పాటు నావికాదళ విన్యాసాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ విన్యాసాలలో భాగంగా భారత నావికాదళం హిందూ మహా సముద్రంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక శ్రీలంక బోటును గుర్తించింది. దీంతో ఆ […]

బోటులో వంద కేజీల హెరాయిన్‌..  శ్రీలంక నుంచి పాక్‌ తరలిస్తుండగా పట్టుకున్న భారత  గస్తీ దళం
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 26, 2020 | 10:38 AM

అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్‌ను ఇండియన్ కోస్టల్ గార్డ్స్ పట్టుకున్నారు. శ్రీలంకకు చెందిన ఓ బోటు ద్వారా పాకిస్తాన్‌కు రవాణా చేస్తున్న వంద కేజీల హెరాయిన్‌ను భారత తీర గస్తీ దళం స్వాధీనం చేసుకుంది. తమిళనాడులోని తూత్తుకుడి సమీపంలో ఈ నెల 17 నుంచి తొమ్మిది రోజుల పాటు నావికాదళ విన్యాసాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ విన్యాసాలలో భాగంగా భారత నావికాదళం హిందూ మహా సముద్రంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక శ్రీలంక బోటును గుర్తించింది. దీంతో ఆ బోటును స్వాధీనం చేసుకుని అందులోని ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. దీంతో అసల వ్యవహారం బయటపడింది. హెరాయిన్‌ను అక్రమంగా పాకిస్తాన్‌కు తీసుకువెళ్తున్నట్టు నిందితులు ఒప్పుకున్నారు. వీటిని పాశ్చాత్య దేశాలకు, ఆస్ట్రేలియాకు అమ్ముతారని తెలిసింది. 99 ప్యాకెట్ల హెరాయిన్‌ను, 20 చిన్న పెట్టెల సింథటిక్‌ డ్రగ్స్‌ను, ఐదు 9 ఎంఎం పిస్టళ్లను, ఒక శాటిలైట్‌ ఫోన్‌ సెట్‌ను గస్తీ దళం స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతోంది.