రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..!

రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..!

రైళ్లు, ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య తగ్గుతోంది. దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని క్రమక్రమంగా రైల్వేశాఖ..

Ravi Kiran

|

Nov 12, 2020 | 9:46 PM

South Central Railway: దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజా రవాణా కంటే వ్యక్తిగత వాహనాల్లోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనితో రైళ్లు, ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య తగ్గుతోంది. దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని క్రమక్రమంగా రైల్వేశాఖ సర్వీసులను పెంచినా కూడా ఆదరణ లభించడం లేదు. ఈ క్రమంలోనే గురువారం పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాగా, కరోనాకు ముందు ఈ రైళ్లలో ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణించారు.

రద్దయిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి…

  • విశాఖపట్నం- విజయవాడ- విశాఖపట్నం
  • నాందేడ్- పాన్వెల్- నాందేడ్
  • ధర్మాబాద్‌- మన్మాడ్- ధర్మాబాద్
  • తిరుపతి- కొల్హాపూర్- తిరుపతి
  • కాచిగూడ- నార్కేర్- కాచిగూడ
  • కాచిగూడ- అకోలా-కాచిగూడ

Also Read:

ఆన్‌లైన్‌ ఛానల్స్‌పై కేంద్రం నిఘా.. ఇకపై అనుమతి తప్పనిసరి..

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టు.!

కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

పసివాడికి ప్రాణం పోసిన సోనూసూద్ సాయం..

బిగ్ బాస్ 4: ఈ వీకెండ్‌కు గెస్ట్‌గా నాగ చైతన్య..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu