పరీక్ష మిస్ కావడానికి వీల్లేదు.. విద్యార్ధులకు సోనూసూద్ హామీ..

స్టూడెంట్స్.. ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లలేమని బెంగ వద్దు.. ప్రైవేట్ రవాణా ఛార్జీలు చెల్లించలేమని ఆందోళన వద్దు.. మీకు నేనున్నానంటున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్.

పరీక్ష మిస్ కావడానికి వీల్లేదు.. విద్యార్ధులకు సోనూసూద్ హామీ..
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 29, 2020 | 2:02 AM

Incase JEE, NEET Happens: స్టూడెంట్స్.. ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లలేమని బెంగ వద్దు.. ప్రైవేట్ రవాణా ఛార్జీలు చెల్లించలేమని ఆందోళన వద్దు.. మీకు నేనున్నానంటున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. నీట్, జేఈఈ పరీక్షల నేపధ్యంలో ఈ రియల్ హీరో మరోసారి సాయం చేసేందుకు రంగంలోకి దిగారు. పరీక్షల నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేసిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రస్తుత పరిస్టితుల దృష్ట్యా తనదైన శైలిలో విద్యార్ధులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఒక వైపు కరోనా రిస్క్.. మరోవైపు ఆర్ధిక ఇబ్బందులు.. ఇలాంటి తరుణంలో చాలా దూరంలో ఉన్న పరీక్షా కేంద్రానికి ఎలా వెళ్ళాలంటూ.. తమకు సాయం చేయాలని కన్నీరుమున్నీరు అవుతున్న ఓ విద్యార్ధి ఆవేదనను సోనూసూద్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన విద్యార్ధులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు.

నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణ ఖాయమైతే.. ఆయా ప్రాంతాల విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి కావాల్సిన రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు సోనూసూద్ సన్నద్ధం అవుతున్నారు. ముఖ్యంగా బీహార్, అస్సాం, గుజరాత్‌లోని వరద బాధిత ప్రాంతాల్లో పరీక్షకు హాజరు కానున్న విద్యార్ధులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. బాధిత విద్యార్ధులు దీనికి సంబంధించిన సమాచారాన్ని అందించాలని, ఏ ఒక్కరూ కూడా ఈ పరీక్షలకు మిస్ కావడానికి వీల్లేదని ట్వీట్ చేశారు. వాస్తవానికి నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలను పోస్ట్ పోన్ చేయాలని స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు కోరుతున్నారు. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని చెబుతోంది. కరోనా నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. దీనితో విద్యార్ధులు ప్రైవేటు వాహనలపైనే ఎగ్జామ్ సెంటర్స్‌కు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలోనే తాము పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు సాయం అందించాలని కొంతమంది విద్యార్ధులు సోనూసూద్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.