AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డేటాలో తేడాలున్నాయి.. రష్యా టీకాపై ఇటలీ శాస్త్రవేత్తల సందేహం..!

రష్యా కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి ప్రముఖ మెడికల్ జర్నల్‌ ల్యాన్సెట్‌లో ప్రచురితమైన సమాచారంపై ఇటలీ శాస్త్రవేత్తలు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

డేటాలో తేడాలున్నాయి.. రష్యా టీకాపై ఇటలీ శాస్త్రవేత్తల సందేహం..!
Balaraju Goud
|

Updated on: Sep 10, 2020 | 12:36 PM

Share

రష్యా కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి ప్రముఖ మెడికల్ జర్నల్‌ ల్యాన్సెట్‌లో ప్రచురితమైన సమాచారంపై ఇటలీ శాస్త్రవేత్తలు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. “స్పుత్నిక్-వి” పేరుతో సమర్పించిన డేటా విశ్వసనీయతను ప్రశ్నించారు, రష్యా పేర్కొన్నట్టు గణాంకాలు నమోదవుడం దాదాపు అసాధ్యమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ల్యాన్సెట్ జర్నల్ ఎడిటర్‌కు బహిరంగ లేఖపై సంతకం చేశారు. టీకా పరీక్షల్లో పాల్గొన్న పలు వలంటీర్లలో ఒకే స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్టు రష్యా పేర్కొనడంపై వారు సందేహాం వ్యక్తం చేశారు

గణాంకాస్త్ర పరంగా విశ్లేషిస్తే.. ఇటువంటి ఫలితం వచ్చే అవకాశం చాలా తక్కువని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. మాస్కోలోని గమలేయ ఇన్స్టిట్యూట్ తన ప్రారంభ దశ ట్రయల్ ఫలితాలను ప్రచురించిన అంతర్జాతీయ పీర్-రివ్యూడ్ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ సంపాదకుడిని ఉద్దేశించి ప్రచురితమైన సమాచారం ఆధారంగా మాత్రమే తాము ఈ అంచనాకు వచ్చినట్టు కూడా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అయితే.. రష్యా టీకా క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన పూర్తి డాటాను తాము పరిశీలించలేదన్న విషయాన్ని కూడా వారు స్పష్టంగా పేర్కొన్నారు. ‘ల్యాన్సెట్‌లో పూర్తి స్థాయి గణాంకాలు ప్రచురితం కాని నేపథ్యంలో.. టీకా ప్రభావశీలతపై నిర్ధిష్టమైన అంచనాకు రావడం కష్టం’ అని వారు వ్యాఖ్యానించారు.

అయితే.. ఈ టీకాను రూపొందించిన గమెలేయా ఇన్‌స్టిట్యూట్ మాత్రం శాస్త్రవేత్తలు వాదనలను కొట్టిపారేసింది. “ప్రచురించిన ఫలితాలు నమ్మదగినవి, ఖచ్చితమైనవని ది లాన్సెట్ సంబంధించి ఐదుగురు విశ్లేషకులు సమీక్షకలను పరిశీలించారని ఇన్స్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ డెనిస్ లోగునోవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రయల్ ఫలితాలపై ముడి డేటా మొత్తం తన సంస్థ ది లాన్సెట్‌కు సమర్పించినట్లు ఆయన చెప్పారు.

ఏదేమైనా, శాస్త్రవేత్తలు తమ నిర్ధారణలను అసలు డేటా కంటే, పత్రికలో ప్రచురించిన రష్యన్ ట్రయల్ ఫలితాల డేటా సారాంశాలపై ఆధారపడుతున్నారని చెప్పారు.