AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ న్యూ లుక్.. అదుర్స్ అంటున్న ఫ్యాన్స్

తమ అభిమానులకు మాత్రం సోషల్ మీడియా వేదికగా టచ్ లో ఉంటున్నారు. అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. మహేష్ తన తాజా లుక్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

మహేష్ న్యూ లుక్.. అదుర్స్ అంటున్న ఫ్యాన్స్
Sanjay Kasula
|

Updated on: Sep 10, 2020 | 1:30 PM

Share

లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన సినిమా ప్రముఖులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే తమ అభిమానులకు మాత్రం సోషల్ మీడియా వేదికగా టచ్ లో ఉంటున్నారు. అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. మహేష్ తన తాజా లుక్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

చాలా నెలల తర్వాత బయటకు వచ్చిన మహేష్ తన కొత్త లుక్‌ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. లైట్‌గా గడ్డం, మీసాలు, డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో మహేష్ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఫొటోపై నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఆధ్వర్యంలో ఈ యాడ్ షూట్ జరిగింది. మళ్లీ షూటింగ్‌కు రావడం సంతోషంగా ఉందని మహేష్ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు.

ఇటీవలి కాలంలో సినిమా సినిమాకు తన లుక్‌లో వేరియేషన్ చూపించాలని ప్రయత్నిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా చాలా కాలం ఇంటికే పరిమితమైన మహేష్ ఓ యాడ్ షూట్ కోసం తాజాగా ఇలా కనిపించారు.

Follow Us