చిత్తూరు జిల్లా అక్కాచెల్లెళ్ల అదృశ్యం.. కడప జిల్లా సుండుపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు.. వారిపైనే అనుమానం
చిత్తూరు జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. చిన్నగొట్టికల్లు మండలం మారసానివారిపల్లికి చెందిన అక్కాచెల్లెళ్లు నెల రోజులుగా కనిపించకుండాపోయారు. దీనిపై కడప జిల్లా సుండుపల్లి పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది.
Sisters Missing : చిత్తూరు జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. చిన్నగొట్టికల్లు మండలం మారసానివారిపల్లికి చెందిన అక్కాచెల్లెళ్లు నెల రోజులుగా కనిపించకుండాపోయారు. దీనిపై కడప జిల్లా సుండుపల్లి పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది.
కడప జిల్లా సుండుపల్లి మండలం రాయవరానికి చెందిన నాగేంద్ర, మణికంఠ అనే అన్నాదమ్ముళ్లతో చిత్తూరు జిల్లాకు చెందిన ఉషారాణి, వాణి అనే అక్కాచెల్లెళ్ల వివాహమైంది. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకున్న అన్నాదమ్ములపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2017 ఫిబ్రవరిలో అక్క ఉషారాణి పెళ్లి నాగేంద్రతో జరగ్గా, 2019లో చెల్లెలు వాణి వివాహం నాగేంద్ర తమ్ముడు మణికంఠతో జరిగింది. గత నెల 17 నుంచి అక్కాచెల్లెళ్లు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఏడాది బిడ్డను వదిలి వెళ్లిన ఉషారాణితో పాటు వాణి ఏమయ్యారో తెలియక పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. దీనిపై సుండుపల్లి పోలీస్టేషన్‌లో గత నెల 19న కేసు నమోదు చేశారు.
అయితే ఇప్పటి వరకు అక్కాచెల్లెళ్ల ఆచూకీ లభ్యం కాకపోవడంతో వీరిని పెళ్లి చేసుకున్న నాగేంద్ర, మణికంఠపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూతుళ్లు ఇద్దరు కనిపించకుండా పోవడంతో వారి తల్లి ఈశ్వరమ్మ అనారోగ్యానికి గురైంది. తండ్రి నిస్సహాయస్థితిలో ఉన్నాడు. దీంతో పోలీసులే న్యాయం చేయాలని వీరి బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు.