AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఆరేళ్ల మనవరాలితో రద్దీ రోడ్డుపై కారు డ్రైవింగ్‌ చేయించిన SI తాత.. కేసు నమోదు

ఓ ఎస్సై తన ఆరున్నరేళ్ల మనవరాలికి రోడ్డుపై కారు డ్రైవింగ్‌ నేర్పిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు స్పందించి సంబంధిత ఎస్సైపై కేసు నమోదు చేశారు..

Watch: ఆరేళ్ల మనవరాలితో రద్దీ రోడ్డుపై కారు డ్రైవింగ్‌ చేయించిన SI తాత.. కేసు నమోదు
SI Teaching Driving to Minor on Road
Srilakshmi C
|

Updated on: Jul 13, 2026 | 10:14 AM

Share

హైదరాబాద్‌, జులై 13: మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని అవగాహన కల్పించే పోలీసు శాఖకే చెందిన ఓ ఎస్సై తన ఆరున్నరేళ్ల మనవరాలికి రోడ్డుపై కారు డ్రైవింగ్‌ నేర్పించేందుకు ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నార్సింగి పోలీసుస్టేషన్‌ పరిధిలోని గంధంగూడలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై పూజారి తిరుపతి తన కారు (టీఎస్‌07 జీపీ 7450)ను మనవరాలికి ఇచ్చి గంధంగూడ రోడ్డుపై డ్రైవింగ్‌ నేర్పిస్తున్నారు. ఆ సమయంలో రద్దీగా ఉండే రహదారిపై చిన్నారి వాహనం నడుపుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అడ్డుకుని, ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఎస్సై, కారు ఆటోమేటిక్‌ వాహనమని, నియంత్రణ తన చేతిలోనే ఉంటుందని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే అక్కడే ఉన్న బాలిక తన తాత ఎస్సై అని చెప్పడంతో ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో కొంతసేపు రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానికుల్లో కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ప్రచారం చేసే పోలీసులే నిబంధనలను ఉల్లంఘించడం సరికాదని విమర్శిస్తున్నారు. ఘటనపై స్పందించిన నార్సింగి పోలీసులు, సంబంధిత ఎస్సైపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీడియో వైరల్‌ కావడంతో అధికారులు సదరు ఎస్సైని సస్పెండ్ చేశారు.

Follow Us
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!