AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: సామాన్యుల కోసం కేంద్రం 5 అద్బుత పథకాలు.. వీటిల్లో చేరితే డబ్బులు భారీగా ఆదా.. ఆన్‌లైన్‌లోనే..

కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని పేదల కోసం అనేక సంక్షేమ పథకాకలను తీసుకొచ్చింది. ఇవి సామాన్యులకు ఎంతగానో సహయపడుతున్నాయి. ప్రస్తుతం నిత్యావసరాలు, వైద్య ఖర్చులు లాంటివి భారీగా పెరిగాయి. దీతో కేంద్రం ఉచితంగా వైద్య చికిత్స, ఉచిత విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పిస్తోంది.

Central Government: సామాన్యుల కోసం కేంద్రం 5 అద్బుత పథకాలు.. వీటిల్లో చేరితే డబ్బులు భారీగా ఆదా.. ఆన్‌లైన్‌లోనే..
Central Government
Venkatrao Lella
|

Updated on: Jul 13, 2026 | 9:41 AM

Share

ప్రజలకు పౌర సేవలను వేగంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా దేశ ప్రజలు అత్యంత సులువుగా ప్రభుత్వ సేవలను పొందవచ్చు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే మొబైల్ ద్వారా అన్నీ సేవలు పొందే సౌలభ్యం ఉంది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజల కోసం కేంద్రం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వీటి ద్వారా పేదలు ఉచితంగా విద్యుత్, వైద్య చికిత్స, గ్యాస్ సిలిండర్ లాంటివి పొందవచ్చు. కేంద్రం అమలు చేస్తోన్న వాటిల్లో టాప్ 5 పథకాలేంటి? వీటికి ఎలా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఉచిత విద్యుత్ సౌకర్యం

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ఫిబ్రవరి 13, 2024న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా ఇంటిపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుని ఉచిత విద్యుత్ పొందవచ్చు. 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్యానెళ్లకు రూ.30 వేలు, మూడు కిలోవాట్ల సామర్థ్యం గల ప్యానెళ్లకు రూ. 78 వేల చొప్పున కేంద్రం సబ్సిడీ అందిస్తోంది. వీటి ద్వారా ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పొందవచ్చు.

గ్యాస్ కనెక్షన్ ఫ్రీ..

ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన 2.0 పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్‌తో పాటు స్టవ్, తొలి సిలిండర్ ఫ్రీగా పొందవచ్చు. ఆ తర్వాత ప్రతీ ఏడాది ఆరు సిలిండర్ల వరకు రూ.300 సబ్సిడీ అందిస్తోంది. దేశంలో గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాల కోసం ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. ప్రతీఒక్కరికీ ఎల్పీజీ సిలిండర్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు. ప్రస్తుతం దీని ద్వారా దేశంలో లక్షలాది మంది లబ్ది పొందుతున్నారు. ఉజ్వల్ యోజన వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన

సెప్టెంబర్ 2018లో ఈ పథకాన్ని మోదీ సర్కార్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రేషన్ కార్డు కలిగి ఉన్న పేదలు దేశంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కడైనా రూ.5 లక్షల వరకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. వాట్సప్ ద్వారా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.

అటల్ పెన్షన్ యోజన

అసంఘటిత రంగ కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రతి నెలా, త్రైమాసికానికి లేదా అర్ధ సంవత్సరానికి కొంత మొత్తం ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత మీ ప్రీమియంను బట్టి నెలకు రూ. 1,000, రూ. 2,000, రూ. 3,000, రూ. 4,000 లేదా రూ. 5,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది.

సుకన్య సమృద్ధి యోజన

‘బేటీ బచావో బేటీ పఢావో’ ప్రచారం కింద సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కేంద్రం ప్రశేపెట్టింది. ఆడపిల్ల ఉన్నత విద్య లేదా వివాహం కోసం తల్లిదండ్రులు డబ్బులు ఆదా చేసుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ పథకం ప్రస్తుతం సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

Follow Us
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
ఇంగ్లాండ్‌తో ప్రతీకార వన్డే సమరం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
ఇంగ్లాండ్‌తో ప్రతీకార వన్డే సమరం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులువు.. కేంద్రం కొత్త సదుపాయం
పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులువు.. కేంద్రం కొత్త సదుపాయం