AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఉదయానే పొలానికి వెళ్లిన రైతు.. గట్లపై భారీ ఆకారంతో కనిపించిన వింత గుర్తులు..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెద్దపులి సంచారం స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పంట పొలాల్లో పులి పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు, ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని, జాగ్రత్తలు పాటించాలని డిప్యూటీ రేంజర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.

Telangana: ఉదయానే పొలానికి వెళ్లిన రైతు.. గట్లపై భారీ ఆకారంతో కనిపించిన వింత గుర్తులు..
Tiger Scare In Asifabad
Naresh Gollana
| Edited By: |

Updated on: Aug 20, 2026 | 2:18 PM

Share

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల, సిర్పూర్, చింతలమానేపల్లి మండలాల పరిధిలో పెద్దపులి స్థానిక ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలియడంతో రైతులు, స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం పొలాలకు వెళ్లిన స్థానిక రైతులకు ఆడేపల్లి, శీర్ష గ్రామాల సమీపంలోని వ్యవసాయ చేనుల్లో పెద్దపులి పాదముద్రలు కనిపించాయి. దీంతో భయపడిపోయిన రైతులు వెంటనే అటవీశాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులి సంచారం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామాలలో రైతులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

కౌటాల మండలం కనికి, కన్నెపల్లి, బోదంపల్లి, చింతలమానేపల్లి మండలం డబ్బా, ఆడేపల్లి, బారెగుడ గ్రామాల శివార్లలో పులి సంచారం నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ కుమార్ సూచించారు. వ్యవసాయ పనుల కోసం చేన్లకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, అటవీ ప్రాంతం వైపు ఒంటరిగా వెళ్లవద్దని డిప్యూటీ రేంజర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.

వివిధ గ్రామాల్లో డప్పు చాటింపులు, మైక్ లతో హెచ్చరికలు జారీ చేస్తూ అవగాహన కల్పిస్తూ ప్రజలను రైతులను అప్రమత్తం చేస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. పంట పొలాల్లో ఎక్కడైనా పులి పాదముద్రలు కనిపించినా, లేదా ఏఐనా ఆనవాళ్లు కనిపించినా వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర