విశాఖతూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడికి ఝలక్.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టిన నిర్మాణాలు కూల్చివేత.!
విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ సర్కారు స్వాధీనం చేసుకుంది. ఎమ్మెల్యేకి చెందిన..
విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ సర్కారు స్వాధీనం చేసుకుంది. ఎమ్మెల్యేకి చెందిన స్థలంలో ఆరు సెంట్లు గెడ్డ పోరంబోకు భూమిని కలుపుకున్నట్టు నిర్ధారించిన రెవెన్యూ అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఋషికొండ సర్వేనెంబర్ 21లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా షెడ్డు, కాంపౌండ్ వాలు నిర్మాణం చేసినట్టు తేల్చారు. ఈ ఉదయాన్నే ప్రొక్లైనర్ తో నిర్మాణాలను తొలగి౦చి హద్దులను ఏర్పాటు చేశారు రెవిన్యూ శాఖ అధికారులు. స్థలంలో ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు.