ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్.. ఒకసారి కలుద్దామంటూ ఆహ్వానం..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకి వ్యవసాయంపై మక్కువ అనే విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర రైతాంగం సంక్షేమం కోసం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకి వ్యవసాయంపై మక్కువ అనే విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర రైతాంగం సంక్షేమం కోసం ఎవరూ ఊహించని విధంగా కొత్త కొత్త పథకాలు తీసుకువచ్చారు. ఎలాంటి అవాంతరం లేకుండా వాటిని అమలు చేస్తున్నారు. అంతేకాదు.. ఎప్పటికప్పుడు వ్యవసాయ పద్ధతులకు సంబంధించి రాష్ట్ర రైతాంగానికి సీఎం సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆదర్శ రైతు ప్రసాదరావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. వేద పద్ధతిలో సాగు చేయడానికి సంబంధించి పలు అంశాలను ప్రసాదరావు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు.. త్వరలో కలుద్దామని ప్రసాదరావుకు చెప్పారు. త్వరలో వాహనం పంపిస్తానని, ఒక పూట ఉండి భోజనం చేసి వెళ్లాలని ప్రసాదరావును సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అలాగే తెలంగాణలో వ్యవసాయ పద్ధతులను పరిశీలించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాలపాలెంకు చెందిన ఉప్పల ప్రసాదరావు.. వేద పద్దతిలో వ్యవసాయం చేస్తున్నారు. 35 ఎకరాల్లో సీడ్రిల్ ఉపయోగించి.. వేద పద్ధతిలో సన్నాల రకం వరిని సాగు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఆయనకు ఫోన్ చేశారు. వరి సాగుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేద పద్ధతిలో ఎకరానికి 40-45 బస్తాల దిగుబడి సాధించానని సీఎం కేసీఆర్‌కు ఆయన వివరించారు. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేయడంపై వరప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రగతి భవన్‌కు వెళ్తానని చెప్పారు.
Also read:
రిలయన్స్ రీస్టార్ట్… కృష్ణ-గోదావరి బేసిన్ నుంచి గ్యాస్ ఉత్పత్తి… ప్రకటించిన ఆర్ఐఎల్…
గుంటూరుజిల్లా బుర్రిపాలెంలో ఉదయాన్నే కలకలం, చందు కృష్ణమూర్తి అనే వ్యక్తి హత్య, గ్రామంలో అలజడి